1.భారత సంతతి వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది.ఆరంజ్ కౌంటీ లోని సుపీరియర్ కోర్ట్ జడ్జి గా భారత సంతతికి చెందిన 39 ఏళ్ల వైభవ్ మిట్టల్ ను ఆరంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయ మూర్తిగా నియమితులు అయ్యారు.
2.భారత ప్రయాణికులకు బ్రిటన్ షాక్
భారత ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా బ్రిటన్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.కొత్త నిబంధన ప్రకారం ఆఫ్రికా, దక్షిణ అమెరికా , ఇండియా, రష్యా, తదితర తదితర దేశాల్లో ఎవరైనా ఒక వ్యక్తి రెండు డోసుల వాక్సిన్ ను తీసుకున్నా.
యూకే దృష్టిలో తీసుకునేట్టే.దీనివల్ల సదరు వ్యక్తి బ్రిటన్ వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా అక్కడ నిబంధన ప్రకారం ఏ టైం లో ఉండాల్సిందే.ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి.
3.ఇల్లినాయిస్ నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్

అమెరికాలోని తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) ఆధ్వర్యంలో ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ ను నిర్వహించింది.ఇల్లినాయిస్ లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్వెస్ట్ త్రో బాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన వచ్చింది.దాదాపు 150 మందికిపైగా తెలుగు మహిళలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.
4. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ కు ర్యాంక్
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారత్ స్థానం ర్యాంకులు మెరుగుపరుచుకుంది.తాజాగా ప్రపంచ మేధోసంపత్తి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్ లో భారత్ 36.4 స్కోర్ తో 46 వ స్థానం లో ఉంది.
5.వారికి ఫైజర్ టీకా సురక్షితం

ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు సురక్షితమని ఫైజర్ సంస్థ తెలిపింది.
6.కరోనా ముప్పు
ఆఫ్రికాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.రోజు కి రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి.
7.సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వాహిని సాహితీ సదస్సు
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వాహిని మూడవ సాహితీ సదస్సు ఆన్లైన్ ద్వారా జరిగింది.
8.అమెరికా అధ్యక్షుడు తో ప్రధాని భేటీ 24 న

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24 న భేటీ కానున్నారు.
9.రష్యా యూనివర్సిటీ లో కాల్పులు .
రష్యాలోని నగరంలోని ఓ యూనివర్సిటీ లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో యూనివర్సిటీలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
10. కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లు.ఢిల్లీ లో దొరికిన నిందితుడు

గత నెల లో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మంది మృతికి కారణమైన ఉగ్రవాదిని ఐదేళ్ల కిందట ఢిల్లీ లో అరెస్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసీస్ – కే వెల్లడించింది.
.