1.మిస్ యూనివర్స్ సింగపూర్ గా తెలుగు అమ్మాయి

మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత బన్న దక్కించుకున్నారు.శుక్రవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచారు.నేషనల్ మ్యూజియం సింగపూర్ లో నిర్వహించిన ఈ పోటీల కోసం ఎనిమిది మంది యువతులు పోటీపడగా నందిత కు ఈ అవకాశం దక్కింది.
2.ఆ రెండు దేశాల వారికి ఈ వీసా ఇవ్వం : భారత్
కెనడా, బ్రిటన్ విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రెండు దేశాల పౌరులకు ఈ వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు హోం శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.కెనడా, యుకె భారత ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
3.కెనడా లో తెలుగు మహిళ ఆవేదన

కెనడాలోని మాంట్రియల్ లో ఉంటున్న దీప్తి రెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలో మెక్ గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేసే వారిని తన భర్త ఆచూకీ కనిపెట్టాలని దీప్తి ట్విట్టర్ ద్వారా కోరింది.
4.దుబాయ్ కీలక ప్రకటన
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీయుల రాక ప్రయాణ ఆంక్షలను తొలగించడంతో భారీగా సందర్శకులు , ప్రవాసులు ఆ దేశానికి తిరిగి వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఫెడరల్ కస్టమ్స్ ఆధారిటీ తాజాగా ఓ ప్రకటన చేసింది.యూఏఈ కి వస్తున్న వారితో పాటు అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్తున్నవారు తమతోపాటు ఎంత డబ్బు తీసుకువెళ్ళవచ్చు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.60 వేల ధిరంస్ (12 లక్షలు ) లేదా అంతకంటే ఎక్కువ తీసుకువెళ్లిన, తెచ్చుకున్న దానిపై కస్టమ్స్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాలని ప్రకటించింది.
5.ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పేలుళ్లు

ఆఫ్ఘనిస్తాన్ లో వరుస బాంబు పేలుళ్ళు చోటు చేసుకున్నాయి.కాబూల్ 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్ లో తాలిబన్ల వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
6.ఇండియా టెకీలకు గుడ్ న్యూస్ ! ట్రంప్ తెచ్చిన వీసా రూల్స్ కొట్టివేత
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మార్చిన హెచ్ వన్ బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
7.రూం దాడిపై యూఎస్ ఆర్మీ క్షమాపణలు

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో గత నెల 29న జరిగిన దాడి తీవ్రమైన తప్పిదమని అమెరికా అభిప్రాయపడింది ఈమేరకు అమెరికా ఆర్మీ క్షమాపణలు చెప్పింది.
8.అమెరికాలో కొత్త వైరస్ ! సైనికులను అలర్ట్ చేసిన పెంటగాన్
అమెరికాలో హవానా సిండ్రోమ్ కేవలం అమెరికా దౌత్యవేత్త లకు మాత్రమే ఉండడంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది.2016 లో క్యూబా రాజధాని లో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయంలో పని చేసిన వారిలో దీనిని గుర్తించారు.దౌత్యవేత్తల తో పాటు తమ సైనికులు కూడా భారీ సంఖ్యలో ఈ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉందని అమెరికా అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో తమ సైనికులను పెంటగాన్ అప్రమత్తం చేసింది.
9.ఆఫ్గాన్ లో మహిళా శాఖ పేరు మార్పు

ఆఫ్ఘనిస్తాన్ లో గత 20 ఏళ్లుగా ఉన్న మహిళ మంత్రిత్వశాఖ భవనానికి ‘ ధర్మ రక్షణ , అధర్మ నిర్మూలన ‘ శాఖ అని పేరు పెట్టారు.
10.పదేళ్ల వరకు సేల్స్ టాక్స్ పెంచం : జపాన్
కరోనా వైరస్ ప్రభావం తో తీవ్ర సంక్షోభానికి జపాన్ గురికావడంతో దాదాపు పదేళ్ల వరకు సేల్స్ టాక్స్ పెంచబోమని ఆ దేశ నేత పుమియో ఖిషీడా తెలిపారు.