1.రెడ్ లిస్ట్ నుంచి భారత్ కు మినహాయింపు
గల్ఫ్ దేశం బెహ్రైన్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాను సవరించింది.దీనిలో భాగంగానే భారత్ తో పాటు పాకిస్తాన్ , పనామా, రోమినికన్ రిపబ్లిక్ ను ఈ జాబితా నుంచి తొలగించింది.
2.ప్రయాణికులకు అబుదాబి గుడ్ న్యూస్

యూఏఈ రాజధాని అబుదాబి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.వీరికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.
3.సురక్షితంగా నే భారత రాయబార కార్యాలయం
కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం సురక్షితంగా నే ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
4.తాలిబన్ ప్రభుత్వ అధినేత ఎంపిక

తాలిబన్ ప్రభుత్వాధినేత గా ముల్లా బరాదర్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
5.కువైట్ లో వైఎస్సార్ కు నివాళి
వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.
6.కోవాక్సిన్ కు నో చెప్పిన కిమ్

ఉత్తర కొరియా కు 30 మిలియన్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా , దానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తిరస్కరించారు.
7.ముంచుకొస్తున్న సౌర తుఫాన్ .ఇంటర్నెట్ పై ప్రభావం
సౌర తుఫాన్ కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలడం ఖాయం అంటూ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.దీని కారణంగా ఇంటర్నెట్ పై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతనే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
8.శ్రీలంకలో కరోనా.ఫుడ్ ఎమర్జెన్సీ

శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.ఒకవైపు మరోవైపు ఆ దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉంది.
9.యుద్ధం ఆపండి .ఆఫ్గాన్ మాజీ అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కీలక ప్రకటన చేశారు.తాలిబన్లకు పంజ్ షీర్ లోని తిరుగుబాటు దళాలకు మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో వెంటనే రెండు వర్గాలు యుద్ధాన్ని అపేసి చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని హమీద్ కర్జాయ్ కీలక ప్రకటన చేశారు.
10.రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పార్టీ నాయకత్వాన్ని వదులుకున్నారు.త్వరలోనే ఆయన ప్రధాని బాధ్యతల నుంచి కూడా తప్పుకోనున్నారు.