తేనే లొలుకు బాష తెలుగు బాష అంటారు.అలాంటి తెలుగు బాషను దేశ విదేశాలలో సైతం పరిమళింపజేస్తున్న తెలుగు వారు ఎంతో మంది ఉన్నారు.
మనకెందుకులే అనుకోకుండా మన మాత్రు బాషను అభివృద్ధి చేద్దాం అనే ధృడ సంకల్పంతో విదేశాలలో ఉంటున్న ప్రవాస తెలుగు కుటుంభాల పిల్లలకు తెలుగును నేర్పుతూ, తెలుగు సంస్కృతీ సాంప్రదాయలను నేర్పుతున్న ఎంతోమంది మహానుభావులు ఉన్నారు.అలాంటి వారిని తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా దక్షిణ ఆఫ్రికా లోని తెలుగు సమాజం, అలాగే నార్వే లోని వీధి అరుగు ఈ రెండు సంస్థలు కలిసి తెలుగు బాషా పురస్కారాలు -2021 తో సత్కరించాయి.
ఇందులో భాగంగానే
కువైట్, ఖతర్, యూఏఈ , ఒమన్, వంటి పలు దేశాల నుంచీ పలువురు తెలుగు ప్రవాసులను ఎంపిక చేసి వారికి ఈ పురస్కారాలను అందజేశారు.దుబాయ్ నుంచీ శ్రీకాంత్, అబుదాబి నుంచీ కామేశ్వర శర్మ, కువైట్ నుంచీ షేక్ బాషా, వెంకప్ప ఇలా పలువురు తెలుగు ప్రవాసులు ఈ గౌరవానికి ఎంపిక అయ్యారు.వీరిలో సిహెచ్ శ్రీకాంత్ www.gulf.com అనే తెలుగు పోర్టల్ నిర్వహిస్తున్నారు.ఏపీ ఎన్నార్టీ కొ ఆర్డినేటర్ గా పనిచేసిన శ్రీకాంత్ దుబాయ్ ఓ తెలుగు బాష అభివృద్దికోసం తనవంతు కృషి చేశారు.అలాగే
అబుదాబిలో ఉంటున్న ఆదిబట్ల కామేశ్వర శర్మ 12 ఏళ్ళుగా అక్కడి విద్యార్ధులకు తెలుగు బాషను భోదిస్తున్నారు.ఆయన తెలుగు బాష అభివృద్ధి కోసం చేపట్టిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు కు ఎంపిక చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా తెలుగు బాషాభివ్రుద్ది కోసం కృషి చేసిన యూఏఈ లోని ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శిగా భాగవతుల వెంకప్ప దాదాపు 17 ఏళ్ళుగా అక్కడే ఉంటూ తెలుగు బాష కోసం విశేష సేవాలు అందించారు.ఇలా చెప్పుకుంటూ పొతే 2014 నుంచీ కువైట్ ఆంధ్రా తెలుగు న్యూస్ అనే పేస్ బుక్ ఎకౌంటు ద్వారా తనకు తెలిసిన దానిలోనే తెలుగు బాష అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు ఇలా ఎంతోమంది తెలుగు ప్రవాసులు తెలుగు బాష కోసం, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాల కోసం నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు.
ఇలాంటి వారికి గౌరవదం దక్కడం తెలుగు వారిగా అభినందించదగ్గ విషయం.