తెలుగు దృశ్యం 2 పై హింట్ ఇచ్చిన సురేష్‌ ప్రొడక్షన్స్‌

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం ను తెలుగు లో దృశ్యం టైటిల్‌ తో రీమేక్ చేసిన వెంకటేష్‌ సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు.ఇక ఇటీవల దృశ్యం 2 మలయాళంలో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Telugu Drushyam 2 Movie Release Date , Drushyam 2, Meena, Narappa, Telugu Flim N-TeluguStop.com

దృశ్యం 2 డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ అయినా కూడా భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే తెలుగు దృశ్యం 2 ను మొదలు పెట్టారు.కేవలం 45 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ ను ముగించారు.

సినిమా ను జూన్‌ లో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ అడ్డు పడింది.సరే థియేటర్లు పునః ప్రారంభం అయిన తర్వాత మెల్లగా విడుదల చేద్దాం అని మేకర్స్‌ భావించారు.

కాని ఓటీటీ ల ద్వారా వచ్చిన ఆఫర్లు నిర్మాతలను ఆగకుండా చేశాయి.దృశ్యం 2 తెలుగు వర్షన్‌ ను కూడా ఓటీటీ ద్వారానే డైరెక్ట్‌ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.

Telugu Drushyam, Meena, Ppa, Telugu, Venkatesh-Movie

దృశ్యం 2 సినిమా షూటింగ్‌ ను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయడంకు కారణం మలయాళ వర్షన్‌ యొక్క వేడి తగ్గక ముందే తెలుగులో విడుదల చేయాలని.కాని థియేటర్లు లేక పోవడం.మళ్లీ ఎప్పటికి థియేటర్లు పునః ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు.అందుకే దృశ్యం 2 సినిమా ను హాట్ స్టార్‌ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

వెంకటేష్‌ నారప్ప సినిమాను అమెజాన్‌ ద్వారా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇక దృశ్యం 2 విషయం ఏంటీ అంటూ మీడియా వారు సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారిని ప్రశ్నించగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఒప్పందం పూర్తి అయ్యింది కనుక దృశ్యం 2 ను వారు ఆగస్టులో స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.నారప్ప కు దృశ్యంకు కనీసం మూడు వారాల గ్యాప్ ఉండేలా చూడాలని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ముందస్తు ఒప్పందం చేసుకున్నారట.

దాంతో దృశ్యం 2 ను ఆగస్టు 15 న స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube