Telangana: షర్మిల చేరిక కాంగ్రెస్ ను డ్యామేజ్ చేస్తుందా..?

రాజకీయాలు ఈ పదంలో ఏముందో ఏమో ఇందులోకి దిగారు అంటే ఇక చచ్చేదాకా కొనసాగాల్సిందే.పాలిటిక్స్ అంటేనే తికమక మకతిక పెట్టే అస్త్రాలు.

 Telangana Will Sharmilas Entry Damage The Congress-TeluguStop.com

ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలి అంటే వాక్చాతుర్యంతో పాటు ప్రజలకి మేలు చేసే గుణం తప్పనిసరిగా ఉండాలి.దీంతో పాటుగా డబ్బు కూడా ఉండాలి అనేది ఈ కాలంలో కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వారసత్వ కుటుంబీకులు ఉన్నారు.అలాంటి కుటుంబీకుల్లో వైయస్ కుటుంబం చాలా ఫేమస్.

వైయస్ రాజకీయ వారసత్వాన్ని అందుకొని ఆయన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS JAGAN ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.ఆయన కూతురుగా వైఎస్ షర్మిల తెలంగాణలో వైయస్సార్ టిపి( YSRTP ) పార్టీని స్థాపించి అతి కొంత కాలంలోనే చాలా క్రేజ్ సంపాదించుకుంది.

తెలంగాణలో ఒక టర్మ్ పాదయాత్ర కూడా చేసింది.

కానీ ఆమెకు ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో కాస్త సైలెంట్ అయిపోయింది.

ఇంకా కొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వైయస్ షర్మిలాని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయాలని ఢిల్లీ అధిష్టానం పావులు కదుపుతోంది.ఈ తరుణంలోనే ఆమె సోనియా( SONIYAGANDHI ), రాహుల్( RAHUL ),ఖార్గేతో(KHARGE) చర్చలు కూడా జరిగాయి.

ఈ చర్చల్లో ఆమె వైయస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనబడుతోంది.ఈ క్రమంలోనే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే పాలేరు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

Telugu Congress, Khammam, Paleru, Rahul Gandhi, Revanth, Sonia Gandhi, Soniya Ga

ఇదే తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.పాలేరు నుంచి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితుమ్మల నాగేశ్వరరావు( THUMMALA NAGESHWARRAO ), పోటికి సిద్ధంగా ఉన్నారు.అంతేకాకుండా వైయస్ షర్మిల కూడా అదే సీట్ అడిగే అవకాశం ఉన్నది.ఇదే తరుణంలో షర్మిలాకు కాంగ్రెస్ నేతల నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడుతోంది.ఆమె ఆంధ్ర నాయకురాలు.తెలంగాణలో ఆమెను పోటీలో దించితే కాంగ్రెస్ కు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.

ఎందుకంటే ఆంధ్ర నాయకుల పాలన మళ్లీ తెలంగాణలో(TELANGANA) స్టార్ట్ అవుతుందనే ఆలోచన జనాల్లోకి వెళుతుంది.కాబట్టి ఆమెను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పకనే చెబుతున్నారు.

Telugu Congress, Khammam, Paleru, Rahul Gandhi, Revanth, Sonia Gandhi, Soniya Ga

ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఏమీ జరగకపోగా నష్టమే ఉంటుందని కాంగ్రెస్లోని కొంతమంది సీనియర్లు భావిస్తున్నారు.తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుక చౌదరి( RENUKA CHOWDARI) కూడా షర్మిలపై సంచలన కామెంట్స్ చేసింది.పాలేరు( PALERU ) నుంచి పోటీ చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా.షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా.ఆమె ఎవరు అక్కడ పోటీ చేస్తా అనడానికి అంటూ చురకలాంటించింది.షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం( KHAMMAM ) జిల్లా ఆడబిడ్డను అంటూ మాట్లాడింది.

అంతేకాకుండా షర్మిల తెలంగాణలో పోటీ చేస్తే నేను ఆంధ్ర వెళ్లి పోటీ చేస్తానని మీడియా ముఖంగా తెలియజేసింది.ఈ విధంగా షర్మిల పార్టీలో చేరడం కొంతమంది నేతలు స్వాగతిస్తుంటే మరి కొంతమంది నేతలు ఆమె వల్ల మనకు నష్టం కలుగుతుందని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube