తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది.ఈ మేరకు కేసును క్లోజ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వీలైనంత త్వరగా గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.అదేవిధంగా గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై దగ్గర ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని గవర్నర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం.
క్లారిఫికేషన్ కోరినట్లు వెల్లడించారు.దీనిపై బిల్లులను తిప్పి పంపాలంటే వెంటనే పంపొచ్చన్న రాష్ట్ర ప్రభుత్వం తన వద్దనే పెండింగ్ లో పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొంది.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కేసును క్లోజ్ చేసింది.అయితే గత కొన్ని రోజులుగా పెండింగ్ బిల్లుల వ్యవహారంలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.