సైంధవ్ నుండి మరో అప్డేట్.. కీలక పాత్రలో ఆ హీరోయిన్!

టాలీవుడ్ లో ప్రజెంట్ సీనియర్ హీరోల్లో ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉంటే మరో ఇద్దరు రేసులో వెనుక ఉన్నారు.బాలకృష్ణ, చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్స్ కొట్టి తమ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించు కున్నారు.

 Team 'saindhav' Welcomes Andrea Jeremiah As Jasmine, Andrea Jeremiah , Saindha-TeluguStop.com

అయితే విక్టరీ వెంకటేష్, నాగార్జున మాత్రం రేసులో వెనుకబడి ఉన్నారు.వీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్లను నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు.

వీరిలో విక్టరీ వెంకటేష్ ( Daggubati Venkatesh ) ప్రజెంట్ చేస్తున్న సినిమాపై అదిరిపోయే అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే ఈయన హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ( Sailesh Kolanu ) దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు.వెంకీ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా అయిన 75వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”సైంధవ్”.

వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తుండడం విశేషం.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ( Shraddha Srinath )ఫైనల్ అయ్యింది.

పవర్ ఫుల్ రోల్ లో వెంకీ నటిస్తున్నాడు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాలో మరొక బ్యూటీ భాగం అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.కోలీవుడ్ వెర్సటైల్ నటి ఆండ్రియా జెరెమియా ‘జాస్మిన్’ అనే కీలక రోల్ లో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.గన్ పట్టుకుని ఉన్న ఈమె ఫస్ట్ లుక్ ఆకట్టు కుంటుంది.ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ ( Nawazuddin Siddiqui)నటిస్తున్నాడు.శైలేష్ కొలను ఈ సినిమాతో వెంకటేష్ కు మంచి హిట్ ఇస్తాడని దగ్గుబాటి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube