ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊసే ఎత్తలేదన్నారు.
విశాఖలో కాపురం పెడతాననడం ఎవరిని ఉద్దరించడానికి అని ప్రశ్నించారు.
విశాఖలో రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.ఏపీకి పెట్టుబడుల వరద అంటూ మంత్రులు ప్రకటనలు ఇస్తుంటే.
మరోవైపు సీఎస్ నిధుల్లేక పథకాలు వాయిదా వేశామంటున్నారని ఎద్దేవా చేశారు.జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు.