నెల్లూరు: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్… సీఎం జగన్ అవినీతి, అసమర్ధతని నెల్లూరు యాసలో ఆనం చక్కగా మాట్లాడుతున్నారు.మేమంతా ఆనంని చూసి గర్వపడుతున్నాం.
ఆనం కుటుంబం ఎన్నో రాజకీయ పదవులు చేపట్టిన కుటుంబం.తాడేపల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలే అర్ధం చేసుకోవాలి.
జగన్ ఆజ్ఞ లేనిదే సజ్జల లాంటి వారు కొట్టిస్తారా? పార్టీ కార్యాలయాలపై దాడులకి కూడా సజ్జలే కారణం.చంద్రబాబుపై దాడిచేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు.
సీఎం జగన్ కళ్లలో పైశాచిక ఆనందం చూడటానికి సజ్జలే దాడి చేయించారు.ఒక రాజకీయ కుటుంబం, 42 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ… ఎంత మందిపై దాడులు చేయిస్తారు.
</br
అన్యాయంగా కేసులు పెట్టించాడు.జగన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్లింది.
ఈ చంపించడం, దాడుల కార్యక్రమాలు ఏమిటి?నీ సొంత జిల్లాలోనే ప్రధానప్రతిపక్ష నేతలకి, జాతీయ నేతలకి భద్రత కల్పించలేరు.ఆనంపై దాడి జరిగి 24 గంటలు నడుస్తుంది.
ఇప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు.ఒకప్పుడు బీహార్ లో ఇలాంటి సంఘటనలు చూస్తుండేవారం.
ఇప్పుడు వారు కూడా అభివృద్దిలో ముందుకు వెళుతున్నారు.ఆనంపై దాడి జరిగితే మంత్రి కాకాణికి బాధ్యత లేదా? సుపారీ ఎవరిచ్చారు? గంజాయి బ్యాచ్ ని ఎవరు పంపించారు? మొత్తం విచారణ జరిపించాలి.అన్ని ఆధారాలు ఉంటే ఎస్పీ ఏం చేస్తున్నారు.ఇసుక, లిక్కర్ అవినీతి సొమ్ము రూ.2వేలు నోట్లు వైసీపీ గూండాలు ప్రతి రోజూ రూ.కోట్లలో డిపాజిట్లు చేస్తున్నారు.