ఎప్పటికీ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నమోదు కాని ఫలితాలను చవిచూసింది.175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లతోనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది.దీంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అధికార పార్టీ వైసీపీ వైపు వలస బాట పట్టారు.
ఇంకా అనేకమంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఈ పరిస్థితుల్లో ఈ కష్ట కాలం నుంచి పార్టీని బయట పడేయాలని చూస్తున్న చంద్రబాబుకు వరుసగా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.
అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా చంద్రబాబు పన్నుతున్న వ్యూహాలు, ఎప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్ కు చేరుతుండడంతో టిడిపిలో ఆందోళన రేగుతోంది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకులు కొంతమంది అనధికారికంగా వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు చంద్రబాబు అనుమానిస్తున్నారు.
వారి కారణంగానే తమ రాజకీయ ఎత్తుగడలను ముందుగానే జగన్ కు చేరిపోతున్నాయి.దీంతో ఆయన ముందుగానే అప్రమత్తమై తెలుగుదేశం పార్టీ ని ఇరుకున పెట్టే విధంగా ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు అని చంద్రబాబుకు అనుమానం కలుగుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరిని చంద్రబాబు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.ఇప్పటి వరకు తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు సైతం వైసీపీ మంత్రులతో స్నేహం చేస్తున్నారని, వారితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారని, ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో తెలుగుదేశం నేతలు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నట్లు చంద్రబాబు అనుమానిస్తున్నారు.

వారి కారణంగానే తెలుగుదేశం పార్టీ వ్యూహాలన్ని జగన్ కు వేగంగా చేరిపోతున్నాయి అని అనుమానిస్తున్నారు.ప్రస్తుతానికి జగన్ బలంగా ఉన్నారు.ఆయనకు, ఆయన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు.అయితే ముందు ముందు వైసీపీని దెబ్బతీసే విధంగా తాను అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాను కాబట్టి ఆ విషయాలు కూడా ఖచ్చితంగా పార్టీ శ్రేణులతో పంచుకోవాల్సి ఉంటుందని, కానీ ఎవరు నమ్మకస్తుడు ఎవరు కోవర్ట్ లో తెలియకపోతే రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బలు తినాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అందుకే తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే వరకు పార్టీ నాయకులకు కూడా తన నిర్ణయాలు ఏవి తెలియకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.