సీనియర్ హీరోస్ అందరికీ ఓకే చెప్పేస్తున్న తమన్నా.. కారణం ఇదే!

తెలుగు సినీ ప్రేక్షకులకు మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తమన్నా మొదట శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 Tamannaah Pairing Up With All Senior Actors, Tamanna Bhatia, Tollywood, Pair Wit-TeluguStop.com

ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా తమన్నా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 ఏళ్లు అవుతతోంది.

అయితే తమన్నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది.

అంతేకాకుండా 17 ఏళ్ల సినీ కెరిర్ లో ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతూనే ఉంది.

అలా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.ఇక ఏ ఇండస్ట్రీలో ఏ ఏ హీరోలతో నటించింది అన్న విషయానికి వస్తే.

తెలుగులో సీనియర్ హీరోలు.చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లతో కలిసి నటించింది.

ఇక తమిళంలో సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ లతో కలిసి నటించింది.అలాగే బాలీవుడ్ లో సీనియర్ హీరోలు అయిన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కూడా కలిసి నటించింది.

Telugu Balakrishna, Bollywood, Chiranjeevi, Nagarjuna, Tamanna, Tollywood-Movie

మలయాళంలో సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్మూట్టి, దిలీప్ లతో కలిసి నటించింది.ఈ విధంగా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరితో తప్ప మిగిలిన సీనియర్ హీరోలందరి సరసన నటించింది తమన్న.మిగతా వారితో కూడా త్వరలోనే జత కట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.కాగా ఈ బ్యూటీ వయసు పరంగా తమన్న చిన్నదే అని చెప్పవచ్చు.ప్రస్తుతం ఆమెకి 32 ఏళ్ళు మాత్రమే.కానీ హీరోయిన్ గా మాత్రం చాలా సీనియర్.

నటిగా ఆమె వయసు 16 ఏళ్ళు.దీంతో ఈమెను ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటించడానికి తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube