బెస్ట్ టీ20 జట్టు ఏదంటే.. చాట్ జీపీటీ సమాధానం ఇదే..!

యూజర్లు అడిగిన ప్రశ్నకు చాట్ జీపీటీ( ChatGPT ) సెకండ్ల వ్యవధిలో వివరమైన సమాధానాలు ఇస్తోంది.సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్ స్టైల్ లాంటి ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగిన క్షణాల్లో సమాధానం చెబుతోంది.

 T20 Legends Team Of All Time Selected By Chatgpt Details, T20 Legends Team , Cha-TeluguStop.com

టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంగతి తెలిసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( AI ) సాయంతో అద్భుత పనితనాన్ని చేసే అధునాతన చాట్ బోట్.

అయితే ఓ వ్యక్తి తాజాగా క్రికెట్ కు( Cricket ) సంబంధించిన ప్రశ్న అడగడంతో సెకండ్ల వ్యవధిలో సమాధానం ఇచ్చేసింది.ఇంతకు ప్రశ్న ఏమిటంటే.టీ20 క్రికెట్లో ఆల్ టైం బెస్ట్ క్రికెట్ జట్టు ఏదని చాట్ జీపీటీ ను అడిగితే.అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది.

క్రికెట్ జట్టును మనుషులు ఏ విధంగా ఆలోచించి జట్టును సెలెక్ట్ చేస్తారో అచ్చం అలాగే బ్యాటింగ్ ఆర్డర్ నుండి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్ కీపర్ లతో సహ ఒక మంచి క్రికెట్ జట్టును ఎంపిక చేసేసింది.

ఓపెనర్లు గా క్రిస్ గేల్,( Chris Gayle ) రోహిత్ శర్మ( Rohit Sharma ) పేర్లను ఎంపిక చేసింది.వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో స్థానంలో మ్యాక్స్ వెల్, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ కోటాలో షాహిద్ ఆఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రషీద్ ఖాన్, పెసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బూమ్రా, డేల్ స్టెయిన్ ల పేర్లు చెప్పింది.క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంపిక చేయలేని టీ20 జట్టును చాట్ జీపీటీ సెలెక్ట్ చేయడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యంగా మనిషి చేయలేని ఎంపికను చేసిందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube