హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద T-SAVE నిరుద్యోగ దీక్ష జరగనుంది.నిరుద్యోగుల పక్షాన అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షను నిర్వహించనున్నారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు అఖిలపక్ష నేతలు.బీజేపీ మినహా ఇతర అన్ని పార్టీల నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలను షర్మిల ఆహ్వానించిన విషయం తెలిసిందే.
రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.