వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత 'ఆదికేశవ'నే.. నాగవంశీ కామెంట్స్ వైరల్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej) హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ‘( Aadi Keshava ).ఉప్పెనతో ఒక్కసారిగా క్రేజ్ పెంచుకున్న వైష్ణవ్ ఆ తర్వాత అంతగా ప్రభావం చూపించలేక పోతున్నాడు.

 Suryadevara Naga Vamsi Comments On Panja Vaisshnav Tej’s Aadikeshava, Suryadev-TeluguStop.com

మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుని మెగా ఫ్యాన్స్ ను తన వైపుకు తిప్పుకున్నాడు.

అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేదు.కొండపొలం, రంగరంగ వైభవంగా వంటి రెండు సినిమాలతో వచ్చి ప్లాప్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన 4వ సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమాపై వైష్ణవ్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు.

ఆదికేశవ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఇక ట్రైలర్ తో మాస్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఆదికేశవ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఈ సినిమా కూడా ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి మాస్ చిత్రాల జాబితాలో చేరిపోతుందని అన్నారు.

ఈ సినిమాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మాస్ సినిమాలు రాలేదని.ఆ ప్లేస్ ను ఆదికేశవ భర్తీ చేస్తుందని అన్నారు.అంతేకాదు ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నవంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్టు తెలిపారు.ఇక ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి శ్రీలీల, వైష్ణవ్ కెమిస్ట్రీ ఆద్యంతం ఎలా అలరిస్తుందో చూడాలి.కాగా జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube