కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య.( Hero Surya ) ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42వ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.”కంగువ”( Kanguva ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.సూర్య సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.
అందుకే ఇప్పుడు చేస్తున్న కంగువ సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
డైరెక్టర్ శివ దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు సూర్య బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు అని టాక్ వస్తుంది.అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే పౌరాణిక సినిమా కోసం సూర్యతో చర్చలు జరపబోతున్నారట.బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా( Rakeysh Omprakash Mehra ) ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని.అది కూడా కర్ణ అనే టైటిల్ తో రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

మరి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈయన బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టే.మహాభారతం లోని ఐకానిక్ పాత్ర కర్ణ పాత్రతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సూర్య కూడా ఓం ప్రకాష్ తో చేయడానికి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు.ఇక సూర్య ప్రజెంట్ చేస్తున్న కంగువ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో మూవీ చేయనున్నారు.మరి ఇది కూడా పూర్తి అయ్యాక 2024లో కర్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట.
చూడాలి ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు అఫిషియల్ అప్డేట్ వస్తుందో.