మరో కొత్త దర్శకుడుకి సురేష్ ప్రొడక్షన్ నుంచి లాంచింగ్

తక్కువ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసే వాళ్ళకి ప్రస్తుతం టాలీవుడ్లో సురేష్ ప్రొడక్షన్స్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.నిర్మాత సురేష్ బాబు చిన్న బడ్జెట్ చిత్రాలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ కొత్త వాళ్లకి దర్శకులుగా అవకాశం కల్పిస్తున్నారు.

 Suresh Babu Gives Chance To New Director, Suresh Productions, Ramanaidu Film Sch-TeluguStop.com

అలాగే ఎవరైనా నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తే వాటిని కొనేసి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.ఇలా చిన్న సినిమాల ద్వారా మంచి హిట్స్ ని సురేష్ బాబు ఈ మధ్యకాలంలో సొంతం చేసుకుంటున్నారు.

పెళ్లి చూపులు సినిమా నుంచి కేరాఫ్ కంచరపాలెం వరకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.వీటి ద్వారా కొత్త దర్శకులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

Telugu Suresh Babu, Suresh-Movie

ఈ టాలెంటెడ్ దర్శకులతో సురేష్ బాబు ఓన్ ప్రొడక్షన్ లో సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో యువ దర్శకుడుకి సురేష్ బాబు అవకాశం ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.రామానాయుడు ఫిలిం స్కూల్ లో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే యువకుడు రీసెంట్ గా సురేష్ బాబుకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ చేసినట్లు తెలుస్తుంది.ఈ స్టోరీ నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే దీన్ని తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాతో కొత్త వాళ్లకి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.మరి ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube