అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తప్పుపట్టింది.
కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న ఆదేశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది.అనంతరం ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది.
అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను న్యాయస్థానం 2023 జనవరి 31కి వాయిదా వేసింది.