Naga Babu Orange Movie : అప్పులపాలు చేసిన సినిమాను మళ్లీ రీ-రిలీజ్ చేస్తానంటున్న నాగబాబు.. కల్ట్ క్లాసిక్ అంటూ?

మెగా బ్రదర్ నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే.హీరోగా పలు సినిమాలలో నటించిన నాగబాబు ఆ తర్వాత నిర్మాతగా మారాడు.

 Nagababu Planning To Re Release Ram Charan Orange Movie , Naga Babu, Tollywood,-TeluguStop.com

అయితే మెగా ఫ్యామిలీ తరఫున స్టార్ హీరోల అండ ఉండి కూడా నాగబాబు ఎదగలేకపోయాడు.ఇక నిర్మాతగా మారి అంజన ప్రొడక్షన్స్ బ్యానర్లు చిరంజీవితో సినిమాలు చేశాడు.

అలా అన్నయ్య చిరంజీవితో కలిసి నాగబాబు రుద్రవీణ త్రినేత్రుడు ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలు నిర్మించగా అవి ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గా నిలిచాయి. బావగారు బాగున్నారా సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

భారీ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా లాభాలు తెచ్చిపెట్టలేకపోయినప్పటికీ హీట్ టాక్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవితో నిర్మించిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవడంతో చిరు తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆరంజ్ సినిమాను నిర్మించాడు.

ఆరెంజ్ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.అంతేకాకుండా నాగబాబుకు కూడా అప్పులను తెచ్చిపెట్టింది.ఇక ఆ సమయంలో తనని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నట్లు నాగబాబు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.ఇక ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు పూర్తిగా బుల్లితెరకె పరిమితం అయిపోయాడు.

చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఏ ఒక్కరు కూడా బాబుకు లాభాల పంటను తెచ్చి పెట్టలేదు.అయితే ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబుకి ఆ అనుభవాలు అన్నీ కొన్ని ఏళ్ల తరబడి వెంటాడాయి.

ఆ తర్వాత నాగబాబు జబర్దస్త్ కి జడ్జిగా అలాగే నటుడిగా ఇలా సంపాదించిన డబ్బులతో అప్పులు మొత్తం తీర్చుకున్నాడు.ఆ తర్వాత వరుణ్ ఒక హీరోగా ఎదగడంతో నాగబాబు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాడు.ఆరెంజ్ సినిమా మాత్రం నాగబాబుని బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పవచ్చు.ఆ అనుభవాలు అన్ని మర్చిపోయిన నాగబాబు ఆ సినిమాను కల్ట్ క్లాసిక్ అని అంటున్నాడు.

త్వరలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తాను అని ప్రకటించారు.ఆరంజ్ సినిమా విడుదల అయ్యి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

అందుకు సంబంధించిన వీడియో ని కూడా పోస్ట్ చేశాడు.అయితే నాగబాబుని అప్పులపాలు చేసిన ఆ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తాను అనడంతో కొందరు నాగబాబు ప్రవర్తన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరి అప్పట్లో నాగబాబుని అప్పుల్లో ముంచెత్తిన ఆరెంజ్ సినిమా మరి ఇప్పుడైనా కలెక్షన్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube