హైదరాబాద్ మెట్రోపై సమ్మర్ ఎఫెక్ట్ పడుతోంది.దీంతో మెట్రో స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
ఎండవేడిమిని తాళలేక నగర వాసులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
అమీర్ పేట్ మెట్రో జంక్షన్ లో భారీగా ప్రయాణికులు బారులు తీరారు.
రైలులో నిలబడేందుకు కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మెట్రో రైలులో ఏసీ ఉండటంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.