సింక్ లో నీళ్లు తాగి హీరో గా ఎదిగిన సుడిగాలి సుధీర్

సినిమా ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని ఎంతో మంది ఆర్టిస్టులు ఫిల్మ్ న‌గ‌ర్ చూట్టూ.ఇందిరాన‌గ‌ర్ అడ్డాలో కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు.

 Sudigali Sudheer Early Days Struggles, Sudigali Sudheer, Jabardast, Magic Show,-TeluguStop.com

ఎలాగైనా అవ‌కాశం ద‌క్కించుకుని త‌మ స‌త్తా చాటాలి అనుకుంటారు.ఆ ప్ర‌యాణంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తారు.

తిన‌డానికి తిండి లేక‌.ఉండ‌టానికి ఇల్లు లేక‌.

చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఎన్నో అవ‌స్థ‌లు ఎదుర్కొంటారు.వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ త‌మ‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు.

అలా వ‌చ్చిన ఓ ఆర్టిస్టు.క‌మెడియ‌న్‌గా మారి బుల్లితెర‌ను ఏలుతున్నాడు.

సినిమాల్లోనూ న‌టిస్తూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.ఇంత‌కీ ఆ న‌టుడు ఎవ‌రు? ఆయ‌న ప‌డ్డ క‌ష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

సుడిగాలి సుధీర్‌.తెలుగు రాష్ట్రాల్లో ఇత‌డు తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.జ‌బ‌ర్ద‌స్త్ వేదికగా త‌న టాలెంట్ ఏంటో చూపించిన ఆర్టిస్టు.టీం మెంబ‌ర్ నుంచి టీం లీడ‌ర్‌గా ఎదిగి.ప్ర‌స్తుతం ప‌లు షోల‌కు యాంక‌ర్‌గా చేస్తున్నాడు.

సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

ఈ స్థాయికి చేరుకునేందుకు సుధీర్ ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.ఇంత‌కీ సుధీర్ ప్ర‌యాణం సినిమాల వైపు ఎలా మ‌ళ్లిందో చూద్దాం!

సుధీర్ సొంతూరు విజ‌య‌వాడ‌.

త‌ల్లిదండ్రులు దేవ్ ఆనంద్, నాగ‌రాణి.త‌నకు ఓ చెల్లి, త‌మ్ముడు ఉన్నాడు.

ఇంట‌ర్మీడియ‌ట్‌లో ఉండ‌గా యాక్టింగ్ మీద ఇంట్రెస్టుతో హైద‌రాబాద్ కు వ‌చ్చాడు.స్టార్ మా చానెల్ నిర్వ‌హించిన స్టార్ హంట్‌లో పాల్గొన్నాడు.

ఫైన‌ల్స్‌కి చేరుకున్నాడు.అటు ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు, స్టార్ హంట్ ఫైన‌ల్స్ ఓకేసారి రావ‌డంతో న‌ట‌న‌కే ఓకే చెప్పాడు.

ప‌రీక్ష‌ల‌కు అటెండ్ కాకుండా ఫైన‌ల్స్ కు వెళ్లాడు.కానీ ఇందులో విజేత‌గా నిల‌వ‌లేక‌పోయాడు.

ఎగ్జామ్స్ రాయ‌లేదు.ఫైన‌ల్స్‌లో గెల‌వ‌లేదు.

రెండిట్లో ఓడి విజ‌య‌వాడ‌కు చేరాడు.

Telugu Jabardast, Magic Show, Smallscreen-Telugu Stop Exclusive Top Stories

త‌న మేన‌మామ ద‌గ్గ‌ర‌ మ్యాజిక్ షో నేర్చుకున్న సుధీర్ ప‌లు స్టేజి షోలు ఇచ్చాడు.మెజిషియ‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు.లోక‌ల్ చానెల్స్ లో స్ట్రీట్ మ్యాజిక్ అనే ప్రోగ్రాం చేశాడు.

ఆ త‌ర్వాత మాటీవీలో వ‌చ్చిన మ్యాజిక్ షోలో హోస్ట్ గా చేశాడు.అటు త‌న తండ్రికి యాక్సిడెంట్ కావ‌డంతో కుటుంబ భారం సుధీర్‌‌పైనే ప‌డింది.

డ‌బ్బు కోసం చాలా షోలు చేశాడు.అయినా ఎక్కువ డ‌బ్బు వ‌చ్చేది కాదు.

తిన‌డానికి తిండిలేక‌.సింక్ నీళ్లు తాగి ప‌డుకునేవాడు.

అలాంటి స‌మ‌యంలో గెట‌ప్ శ్రీ‌ను ప‌రిచ‌యం అయ్యాడు.త‌న స‌హ‌కారంతో జ‌బ‌ర్ద‌స్త్ లో చేరాడు.

కొద్ది రోజుల్లోనే టీం మెంబ‌ర్ నుంచి టీం లీడ‌ర్‌గా ఎదిగాడు.ఆ త‌ర్వాత ప‌లు షోలో చేశాడు.

సినిమాల్లోనే అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు.సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా చేశాడు.

మ‌రి కొన్ని సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube