అమెరికాలోని న్యూయార్క్ కౌన్సిల్ వుమెన్ ఇన్నా వెర్నికోవ్‌కు( Inna Vernikov ) ఊహించని అనుభవం ఎదురైంది.ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తి ముద్దు పెట్టుకోవడం కలకలం రేపుతోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.న్యూయార్క్ సిటీ( Newyork City ) 48వ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిల్ ఉమెన్ ఇన్నా వెర్నికోవ్ బ్రూక్లిన్‌లోని బ్రైటన్ బీచ్ పరిసరాల్లో సీబీఎస్ న్యూయార్క్ రిపోర్టర్ హన్నా క్లిగెర్‌కి( Hannah Kliger ) ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సమయంలో గుర్తుతెలియని అపరిచిత వ్యక్తి ఇన్నాను ముద్దాడాడు.గురువారం ఈ సంఘటన జరిగింది.
వెర్నికోవ్ స్థానిక విషయాలను చర్చిస్తూ ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె చెంపపై ముద్దు పెట్టి( Stranger Kiss ) తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ హఠాత్పరిణామానికి షాకైన వెర్నికోవ్ వెంటనే అతని బారి నుంచి తప్పించుకునేందుకు వెంటనే తలను పక్కకు తిప్పారు.ఈ ఘటనపై వెర్నికోవ్ వ్యంగ్యంగా స్పందించారు.కమ్యూనిటీ నుంచి నేను ఆశించేది ప్రేమ కాదన్నారు.ఇదొక గగుర్పాటు కలిగించే చర్యగా అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
సహచర సిటీ కౌన్సిల్ సభ్యుడు లిన్ షుల్మాన్( Lynn Schulman ) ఈ ఘటనను ఖండిస్తూ వెర్నికోవ్‌కు మద్ధతు ప్రకటించారు.ఈ చర్య అసహ్యకరమైనదని.దుండగుడు దొరికాడని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
పాపం 2023లోనూ మహిళలకు ఇలాంటి ఆమోదయోగ్యం కానీ ప్రవర్తన జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నెటిజన్లు కూడా ఈ ఘటన పట్ల మండిపడుతున్నారు.
కౌన్సిల్ ఉమెన్ వెర్నికోవ్ ఈ ఘటనపై దూకుడుగా స్పందించాలని హితవు పలికారు.న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్( New York Mayor Eric Adams ) అవుట్ డోర్ డైనింగ్ బిల్లుపై సంతకం చేయడానికి సంబంధించి “eye candy” గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనతో సంబంధం లేనప్పటికీ, మేయర్ ఆడమ్స్ లింగ-సంబంధిత వ్యాఖ్యలు, ప్రవర్తన చర్చలకు దారితీశాయి.