అమెరికా : లైవ్‌లో న్యూయార్క్ కౌన్సిల్ సభ్యురాలికి ముద్దుపెట్టిన అపరిచితుడు.. వీడియో వైరల్
TeluguStop.com
అమెరికాలోని న్యూయార్క్ కౌన్సిల్ వుమెన్ ఇన్నా వెర్నికోవ్‌కు( Inna Vernikov ) ఊహించని అనుభవం ఎదురైంది.
ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తి ముద్దు పెట్టుకోవడం కలకలం రేపుతోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.న్యూయార్క్ సిటీ( Newyork City ) 48వ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిల్ ఉమెన్ ఇన్నా వెర్నికోవ్ బ్రూక్లిన్‌లోని బ్రైటన్ బీచ్ పరిసరాల్లో సీబీఎస్ న్యూయార్క్ రిపోర్టర్ హన్నా క్లిగెర్‌కి( Hannah Kliger ) ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సమయంలో గుర్తుతెలియని అపరిచిత వ్యక్తి ఇన్నాను ముద్దాడాడు.గురువారం ఈ సంఘటన జరిగింది.
"""/" /
వెర్నికోవ్ స్థానిక విషయాలను చర్చిస్తూ ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె చెంపపై ముద్దు పెట్టి( Stranger Kiss ) తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ హఠాత్పరిణామానికి షాకైన వెర్నికోవ్ వెంటనే అతని బారి నుంచి తప్పించుకునేందుకు వెంటనే తలను పక్కకు తిప్పారు.
ఈ ఘటనపై వెర్నికోవ్ వ్యంగ్యంగా స్పందించారు.కమ్యూనిటీ నుంచి నేను ఆశించేది ప్రేమ కాదన్నారు.
ఇదొక గగుర్పాటు కలిగించే చర్యగా అసహనం వ్యక్తం చేశారు.అయితే ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
"""/" /
సహచర సిటీ కౌన్సిల్ సభ్యుడు లిన్ షుల్మాన్( Lynn Schulman ) ఈ ఘటనను ఖండిస్తూ వెర్నికోవ్‌కు మద్ధతు ప్రకటించారు.
ఈ చర్య అసహ్యకరమైనదని.దుండగుడు దొరికాడని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
పాపం 2023లోనూ మహిళలకు ఇలాంటి ఆమోదయోగ్యం కానీ ప్రవర్తన జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నెటిజన్లు కూడా ఈ ఘటన పట్ల మండిపడుతున్నారు.కౌన్సిల్ ఉమెన్ వెర్నికోవ్ ఈ ఘటనపై దూకుడుగా స్పందించాలని హితవు పలికారు.
న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్(
New York Mayor Eric Adams ) అవుట్ డోర్ డైనింగ్ బిల్లుపై సంతకం చేయడానికి సంబంధించి "eye Candy" గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటనతో సంబంధం లేనప్పటికీ, మేయర్ ఆడమ్స్ లింగ-సంబంధిత వ్యాఖ్యలు, ప్రవర్తన చర్చలకు దారితీశాయి.
95 పైసల కోసం ఇంత రచ్చా? క్యాబ్ డ్రైవర్‌తో జర్నలిస్ట్ వార్.. వీడియో వైరల్..