పక్షి గూళ్లలో నివసించే ప్రజలు... ఎక్కడున్నారంటే..

ప్రపంచ వ్యాప్తంగా గల పలువురు వింత వ్యక్తులు, విచిత్ర ప్రదేశాలు ఎంతో ఆసక్తి గొలుపు తుంటాయి.గూళ్లు కట్టుకుని ఎవరు నివసిస్తుంటారని ఎవరైనా అడిగితే, దాదాపు ప్రతి ఒక్కరూ పక్షి అని సమాధానం ఇస్తుంటారు.

 Strange Village World Where People Live In Nests Village, People , Live In Nes-TeluguStop.com

అయితే మనుషులు కూడా గూళ్లలో నివసిస్తారని చెబితే ఎవరూ నమ్మరు.ఎందుకంటే ప్రతి మనిషికి విలాసవంతమైన ఇంటికి సంబంధించిన కల ఉంటుంది.

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని, అందులో అన్ని సౌకర్యాలు అందు బాటులో ఉండాలని కోరుకుంటారు.కానీ ఇటువంటి ఆలోచనకు భిన్నమైన మనుషుల గురించి ఇప్పుడు తెలుసు కుందాం.

ఆ గ్రామం పేరు కండోవన్.ఇరాన్‌లోని కండోవన్ గ్రామ ప్రజలలో గూళ్లు కట్టుకుని వాటిలో నివసించే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది.

ఈ గ్రామం దాని సాంప్రదాయం అద్భుతమైన జీవన శైలికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఈ ఊరి ప్రజలు మట్టితో గూడు కట్టుకుని పక్షుల్లా జీవిస్తున్నారు.

కండోవన్ అంటే తేనెటీగల గూడు అని అర్ధం.ఆసక్తికరమైన విషయమేమిటంటే.

గూడు లాంటి ఇళ్లలో ఇక్కడి ప్రజలు ఒకట్రెండు సంవత్సరాలు కాదు.గత 700 ఏళ్లుగా నివసిస్తున్నారు.

అనేక తరాలుగా ఈ ఇళ్లలో ఈ ప్రజలు నివసిస్తున్నారు.కండోవన్‌కి చెందిన పూర్వీకులు మంగోలుల దాడి నుండి తప్పించుకోవడానికి ఇక్కడకు తరలి వచ్చారు.

ఇక్కడి పూర్వీకులు మంగోలియన్ల దాడి నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ మారుమూల ప్రాంతంలో ఇటువంటి ఇళ్లను నిర్మించారు.దండ యాత్ర చేస్తున్న మంగోలుల నుండి తప్పించు కోవడానికి ఈ ప్రజల పూర్వీకులు అగ్నిపర్వత శిలలను తవ్వి తమ శాశ్వత నివాసంగా చేసుకున్నారు.

గృహాల ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇళ్ళు పర్యావరణానికి అనుకూలమైనవి.ఇక్కడ చలికాలంలో వేడిగానూ, వేసవిలో చల్లగానూ ఉంటుంది.ఈ ఇల్లు చూడటానికి చాలా వింతగా అనిపించినా చాలా సౌకర్య వంతంగా ఉంటుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గ్రామంలోని ప్రజలకు చలి కాలంలో హీటర్‌, వేసవిలో ఏసీ అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube