గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం.
ఎందుకంటే.ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉంటాయి.
ఇక పిల్లల నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్థాల్లో గుడ్డు కూడా ఒకటి.గుడ్డు తినడం వల్ల.
మన శరీరానికి కావాల్సిన పొటాషియం,కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి ముఖ్య పోషకాలు అందడంతో పాటు.తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
అలాగే గుడ్లను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.మరియు బరువు కూడా తగ్గవచ్చని చెబుతున్నారు.గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది.
ఐరన్ గర్భిణులు, బాలింతలకు బాగా యూజ్ అవుతుంది.

అంతేకాదు, మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కూడా ఐరన్ కాపాడుతుంది.ఇవన్నీ పక్కన పెడితే.సాధారణంగా గుడ్ల విషయం దాదాపు అందరూ చేసే పొరపాటు ఫ్రిజ్‌లో పెట్టడం.
ఇలా చేయడం వల్ల కొన్ని రోజులు నిల్వ ఉంటాయి.అందుకే ఒకటేసారి ఎక్కువ పరిమాణంలో గుడ్లను తెచ్చుకుని ఫ్రిజ్ స్టోర్ చేస్తారు.
కానీ, ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.గుడ్లని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపలి భాగం పాడైపోయి పై పెంకుపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.
దీంతో అవి ఉడికిన అంతగా రుచిగా ఉండవు.అలాగే అది మీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అందుకే గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టవద్దని సూచిస్తున్నారు.