అసంతృప్తా ఆగండాగండి  ! బుజ్జగింపుల్లో బీఆర్ఎస్ బిజీ

అసంతృప్తులపై బీఆర్ఎస్( BRS ) అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో చాలామంది అసంతృప్తికి గురయ్యారు.

 Stop Being Unhappy! Brs Is Busy In Appeasement, Brs,bjp, Congress, Telangana Ele-TeluguStop.com

కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధం కాగా,  మరికొంతమంది కాంగ్రెస్,  బిజెపిలలో( Congress , BJP ) చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అసంతృప్త నాయకులను కొంతమందిని బొజ్జగించి వారికి నామినేటెడ్ పదవులను బిఆర్ఎస్ అధిష్టానం కట్టబెట్టింది.

అయినా ఇంకొంతమందిలో అసంతృప్తి ఉండడంతో , వారిని బుజ్జగించేందుకు,  రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో వారికి ప్రాధాన్యం కల్పించబోతున్నామని విషయాన్ని చెప్పి,  వారు పార్టీ మారకుండా చూసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలను రంగంలోకి దించింది.ఎవరు పార్టీ మారకుండా చూడడంతో పాటు,  ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల విజయం కోసం వారు పనిచేసే విధంగా అసంతృప్తులను బుద్ధిగించే పనులు బీఆర్ఎస్ కీలక నాయకులు ఉన్నారు.

Telugu Brs, Congress, Telangana-Politics

ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా పోటీపడి రాకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారిని ఇతర పార్టీలవైపు వెళ్ళకుండా ఆపేందుకు ముఖ్య నాయకులంతా రంగంలోకి దిగారు.రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తాము,  ఏ ఏ పదవులు ఇస్తామనే హామీలు ఇస్తూ వారి అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే వేములవాడ టికెట్ ను సెట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కాకుండా చల్మేడ లక్ష్మీనరసింహారావుకు( Chalmeda Lakshminarasimha Rao ) ప్రకటించడంతో రమేష్ అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా తో కేసీఆర్ నియమించారు.

ఐదేళ్ల పాటు ఈ పదవి ఉంటుంది.ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్( MLA Ramulu Naik ) కు కాకుండా మదన్ లాల్ కు టికెట్ ఇవ్వడంతో రాములు నాయక్ తీవ్ర అసంతృప్తి గురయ్యారు .తనకు కాకపోయినా తన కుమారుడు అయిన టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం దక్కలేదు.అయితే రాబోయే రోజుల్లో సరైన ప్రాధాన్యం ఇస్తామని పార్టీ నేతలు బుజ్జగింపునకు దిగడంతో ఆయన మదన్ లాల్ కోసం పనిచేస్తానని రాములు ప్రకటించారు.

Telugu Brs, Congress, Telangana-Politics

ఇక ఆసిఫాబాద్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వలేదు.ఆమెకు బదులుగా జడ్పీ చైర్మన్ గా ఉన్న కోవ లక్ష్మికి టికెట్ ను ఇచ్చారు.అయితే ఆత్రం సక్కును బొజ్జగించడంతో ఆమె నిన్న నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కోవా లక్ష్మితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి వారికి సరైన భరోసా ఇవ్వడం ద్వారా , వారిలో అసంతృప్తిని పోగొట్టే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం కొంతమంది కీలక నేతలను రంగంలోకి దించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube