ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా అధికారులు, పాలకులు ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.ఎన్నికల సమయంలో వచ్చి వరాల జల్లు కురిపించి ఆ తర్వాత వాటిని పాలకులు మర్చిపోతుంటారు.
లేదంటే ప్రజలకు ఇష్టం లేేని పని చేసినా కూడా ప్రజలు ఊరుకోరు.దీంతో వారు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుకుంది.కెనడా లోని ప్రజలు నిరసన తెలిపారు.
తమ నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పై రాళ్ల దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు.
ఆ కార్యక్రమంలో ప్రజలు నిరసన తెలుపుతుండగా కొందరు రాళ్ల దాడి చేశారు.ప్రధానిపై రాళ్ల దాడి చేయడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు.
దీంతో ప్రధానికి ఎటువంటి గాయాలు అవ్వలేదు.ప్రధానిపై రాళ్ల దాడి చేయడంతో ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతగా మారింది.
కెనడా లోని ఒంటారియాలో ఈ ఘటన జరగడంతో దేశం మొత్తం కలకలం రేగింది.కెనడాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని తప్పనిసరిగా చేశారు.
దీంతో ఆ దేశంలో వ్యాక్సిన్ కు వ్యతిరేకత అనేది నెలకొంది.వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఒంటారియోలో ఎన్నికల సభలో పాల్గొంటుండగా వ్యాక్సిన్ వ్యతిరేకులు ఆయన కాన్వాయ్‌ను అడ్డగించారు.చుట్టుముట్టిన ప్రజలు ఆ సమయంలో రెచ్చిపోయారు.
ప్రధానిపై రాళ్లతో దాడికి యత్నించారు.ఆ సమయంలో ప్రధాని సురక్షితంగా బయటపడ్డాడు.

ఈ తరుణంలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే దాడికి పాల్పడడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధన విధించడమేనని స్పష్టం అవుతోంది.ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలని ప్రధాని ట్రూడో కఠిన ఆంక్షలు విధించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.వ్యాక్సినేషన్ కు సంబంధించి సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేయడంతో కొందరు యాంటీ వ్యాక్సిన్ నిరసనను తెలియజేశారు.
గత కొన్ని రోజులుగా ఆందోళనకారులు వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రధానిపై దాడి జరిగింది.