టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో వరుసగా నటిస్తూ ఈ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ప్రేమమ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అనుపమ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ నెటిజన్లను, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా అనుపమ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ తాను మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఆమె తెలిపారు.
తనకు లవ్ మ్యారేజ్ పై మంచి ఒపీనియన్ ఉందని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న జంటలను చూస్తే తనకు ముచ్చటగా అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.నాకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసంటూ అనుపమ ఫ్యాన్స్ కు ఒకింత షాకిచ్చారు.

తాను సింగిల్ కాదని మింగిల్ అని ఆమె అన్నారు.నా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి నాకు కూడా సరైన అవగాహన లేదని ఆమె తెలిపారు.తాను లవ్ లో ఉన్నానని అవతలి వైపు నుంచి ఏమని అనుకుంటున్నారో తనకు అయితే తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.
అందువల్ల తాను వన్ సైడ్ లవ్ అని చెప్పగలనని అనుపమ కామెంట్లు చేశారు.అభిమానులు తనపై చూపిస్తున్న లవ్ కు కృతజ్ఞతలు అని అనుపమ వెల్లడించారు.సోషల్ మీడియాలో తన గురించి వచ్చే మీమ్స్ ను తాను చూస్తానని ఆ మీమ్స్ ను చూసి తాను నవ్వుకుంటానని ఆమె కామెంట్లు చేశారు.అనుపమ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అనుపమ కెరీర్ పరంగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.