తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.త్వరలోనే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ ( Varun Tej ) వివాహం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.
వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల సమక్షంలో చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ 31 కాబోతోంది ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన ఎంఎం కీరవాణి కుమారుడు వివాహం కూడా జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహిని ని నిశ్చితార్థం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
వెంకటేష్( Venkatesh ) సాధారణంగా ఏ విషయాలను బయటకు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడరు తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయం అయినా కూడా చాలా గోప్యంగా ఉంచుతారు.ఈ క్రమంలోని తన కుమార్తె నిశ్చితార్థం( Hayavahini Engagement ) గురించి ఎక్కడ ప్రకటించకుండా ఏకంగా ఈయన నిశ్చితార్థం జరిపించి అందరికీ షాక్ ఇచ్చారు.అయితే ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా విజయవాడకు తరలి వెళ్లారు.
ఇలా వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా రానా నాగచైతన్య మహేష్ బాబు నమ్రతా దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా హాజరై సందడి చేశారు.ఈ విధంగా నిశ్చితార్థ వేడుకలు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరైనప్పటికీ ఒక స్టార్ హీరో మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.మరి వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు దూరంగా ఉన్నటువంటి ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే మరెవరో కాదు అక్కినేని నాగార్జున.
అక్కినేని నాగార్జున వెంకటేష్ మధ్య గత కొంతకాలం నుంచి మాటలు లేవు అనే విషయం మనకు తెలిసిందే.తమ సోదరి లక్ష్మీకి నాగార్జున ( Nagarjuna ) పెళ్లి చేసుకుని నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వడంతో అప్పటినుంచి దగ్గుబాటి కుటుంబానికి అక్కినేని కుటుంబానికి మధ్య ఎలాంటి మాటలు లేవని తెలుస్తోంది.
నాగచైతన్య( Naga Chaitanya ) వెంకటేష్ కి స్వయాన మేనల్లుడు కావడంతో ఈయనతో దగ్గుబాటి కుటుంబం చనువుగా ఉండడమే కాకుండా నాగచైతన్యను కూడా తమ ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తున్నారు.అయితే ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా నాగచైతన్య సందడి చేసినప్పటికీ నాగార్జున మాత్రం సందడి చేయలేదు.వెంకటేష్ నాగార్జున పై ఉన్న కోపంతోనే తన కుమార్తె నిశ్చితార్థానికి తనని ఆహ్వానించలేదని తెలుస్తుంది.ఇలా రెండు కుటుంబాల మధ్య కూడా మాటలు లేకపోవడం వల్లే వెంకటేష్ ఆహ్వానించలేదని నాగార్జున కూడా ఈ కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది.