కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మోహన్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
వరుస విజయాలతో అప్పటి స్టార్ హీరోలకు మోహన్ బాబు గట్టి పోటీని ఇచ్చారు.ఈ ఏడాది మోహన్ బాబు నటించి విడుదలైన సన్నాఫ్ ఇండియా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా సరైన కథను ఎంచుకుంటే మోహన్ బాబు సక్సెస్ ట్రాక్ లోకి రావడం కష్టమేమీ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
యమదొంగ సినిమా తర్వాత మోహన్ బాబు నటించిన సినిమాలలో ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా అయితే లేదనే చెప్పాలి.ప్రముఖ దర్శకులలో ఒకరైన ఎన్.
శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో సినిమా శ్రీ రాములయ్య ఛాలెంజింగ్ సినిమా అని ఎన్.శంకర్ అన్నారు.పరిటాల రవి పెళ్లిళ్లకు వెళ్లేవారు కాదని అప్పుడు టీడీపీ పవర్ లో ఉండటంతో ఆయన పెళ్లికి వచ్చారని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.
మేం మాట్లాడుతూ ఉన్న సమయంలో కొంచెం దూరంలో పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో శ్రీహరి పరిటాల రవి ఉన్న కారును పేల్చేశారని చెప్పారని ఎన్.శంకర్ అన్నారు.శ్రీహరి కారులో తాను వెళ్లానని తాను నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరిటాల రవిని కలిశామని ఎన్.శంకర్ వెల్లడించారు.ఆస్పత్రిలో పరిటాల రవి పరిస్థితి ఏంటని అడగగా ఆయన సేఫ్ అని చెప్పారని ఎన్.శంకర్ కామెంట్లు చేశారు.