సీఎం జగన్ కి కొన్ని ప్రత్యేక సూత్రాలుంటాయి.జగన్ కి ఓ ఇద్దరి విషయంలో చెమటలు పడుతున్నాయట.
మంత్రి పదవులు ఇవ్వాలా.? వద్దా.? ఇస్తే ఎవరికీ ఇవ్వాలి.? మిగిలిన వారిని ఎలా శాంతిపపజేయాలి.? అనే విషయంలో అంతర్మధనం చెందుతున్నారని వైసీపీ వర్గాల సమాచారం.ఆ ఇద్దరే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి ఎమ్మెల్యే రోజా వరుసగా రెండోసారి గెలిచారు.పార్టీలో మొదటి నుండి ఉన్నారు.
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు.సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా టీడీపీని ముప్పుతిప్పలు పెట్టేలా అసెంబ్లీ లోపల, బయట విమర్శలు గుప్పించారు.మాటదాడితో.
నోటిధాటితో జగన్ కి వెన్నుదన్నుగా నిలిచారు.అటువంటి రోజాకు 2019లో వైసీపీ మొదటి మంత్రివర్గంలోని మంత్రిగా అవకాశం వస్తుంది అనుకున్నప్పటికీ రాలేదు.
దీంతో ఆమె బాగా అప్సెట్ అయ్యారు.ఓ విధంగా రచ్చ రచ్చ చేసారు.
అంతర్గతంగా చాలా ఆవేదన చెందారు.సన్నిహితుల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.
సర్లే ఏపీఐఐసీ పదవి ఇచ్చి.రెండున్నరేళ్ల తర్వాత చూద్దాం అనే హామీతో సర్దుకుపోయారు.
కానీ ఇప్పుడు ఆమెకు పెద్దిరెడ్డి రూపంలో అడ్డు వస్తుంది.

ఇక ఈ జిల్లాలో పెద్దిరెడ్డి చాలా సీనియర్.కానీ కాంగ్రెస్ హయాంలో మరుగున పడిపోయాడు.సీనియర్ అయినప్పటికీ.
, వరుసగా గెలుస్తున్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతన్ని పట్టించుకోలేదు.కానీ సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
మంత్రి వర్గంలో తన తర్వాత అంతటి స్థానాన్ని కట్టబెట్టారు.పెద్దిరెడ్డి కూడా జగన్ కీ., తనకి ఉమ్మడి శత్రువైన బాబుని రాజకీయంగా మెట్టు, మెట్టు దించేయడంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.దానిలో భాగమే కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు.
ప్రస్తుతం కూడా కుప్పంలో చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించే టార్గెట్ తో పని చేస్తున్నారు.
అటువంటి తరుణంలో పెద్దిరెడ్డికి మంత్రిగా తొలగిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు.
కానీ రోజాకు ఇస్తే మాత్రం పెద్దిరెడ్డికి కొన్ని ఇబ్బందులు తప్పవు.ఎందుకంటే నగరి నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని.
వారికి పార్టీలో, నామినేటెడ్ పదవుల విషయంలో పెద్దిరెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రోజా గట్టిసా నమ్ముతున్నారు.అందుకు తగిన ఆధారాలతో ఆల్రెడీ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం.
మనసులో పెట్టుకున్న రోజాకు మంత్రి పదవి ఇస్తే కచ్చితంగా పుంగనూరు సహా పెద్దిరెడ్డి కోటలుగా ఉన్న తంబళ్లపల్లి, పూతలపట్టు లాంటి నియోజకవర్గాల్లో కొన్ని గ్రూపులు వచ్చే అవాకాసం ఉంది.

పార్టీలో ఎంత సీనియర్ అయినప్పటికీ.పార్టీ పరంగా ఎంత పెద్ద పదవి ఉన్నప్పటికీ మంత్రి అంటే మంత్రే.అందుకే రోజా విషయంలో పెద్దిరెడ్డి చాలా సీరియస్ గా వద్దు అంటున్నారని సమాచారం.
కానీ ఇక్కడ పెద్దిరెడ్డిని కొనసాగించి రోజాకు ఇవ్వకపోతే రోజా బాగా హర్ట్ అవుతుంది.రోజాకి ఇచ్చి పెద్దిరెడ్డిని పక్కన పెడితే కచ్చితంగా అంతర్గత అగ్గి పుట్టుకొస్తుంది.పోనీ ఇద్దరికీ ఇవ్వాలంటే ఒకో జిల్లాలో ఒకో పార్లమెంటు పరిధిలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు అంత మంచి సంకేతం కాదు అనే భావనలో జగన్ ఉన్నారట.