టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణను దగ్గరినుంచి చూసిన వాళ్లు ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయని చాలా సింపుల్ గా ఉంటారని చెబుతారు.దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరసింహారెడ్డి షూటింగ్ ను సిరిసిల్ల, టర్కీలో చేశామని ఈ రెండు చోట్ల ఎండలు భారీగా ఉన్నా బాలయ్య మాత్రం గొడుగు ఉపయోగించకుండా షూట్ లో పాల్గొన్నారని చెప్పారు.
ఇతర హీరోలకు భిన్నంగా బాలయ్య ఉంటారని సింపుల్ గా ఉండటానికి బాలయ్య ఇష్టపడతారని గోపీచంద్ మలినేని పరోక్షంగా చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.
బాలయ్య ప్రభాస్ కాంబో ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుందని ఆయన కామెంట్లు చేశారు.బాలయ్యను మొదట రేసీగా ఉండే ఒక కథతో సంప్రదించగా బాలయ్య కథ నచ్చినా నా నుంచి మరింత ఎక్కువగా ఆశిస్తారని చెప్పారని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
స్టార్ హీరో అయినా సింపుల్ గా ఉండటం బాలయ్యలో ఉన్న గొప్ప లక్షణమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.వీరసింహారెడ్డిలో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ను హైలెట్ చేశామని ఆయన తెలిపారు.బాలయ్య గత సినిమాలలో సెకండ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ కు వస్తుందని ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ఆ పాత్ర చనిపోతుందని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.కథను నమ్మి ముందుకెళ్లామని ఆయన వెల్లడించారు.
వీరసింహారెడ్డి పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని గోపీచంద్ మలినేని తెలిపారు.పవర్ ఫుల్ గా ఉందని ఈ టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాలో హింస ఎక్కువేం లేదని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.పలు ఏరియాలలో వీరసింహారెడ్డి సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందనే సంగతి తెలిసిందే.