జగిత్యాల మెడికల్ కాలేజీ క్యాంపస్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.అర్ధరాత్రి సమయంలో డాక్టర్లు శశికాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ తో గొడవకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వైద్యులు ఇద్దరూ తనను కులం పేరుతో దూషించారని వైస్ ప్రిన్సిపాల్ డేవిడ్ ఆనంద్ ఆరోపిస్తున్నారు.అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో గది ఇవ్వడం లేదని వివాదానికి దిగారని చెబుతున్నారు.
అనంతరం ఇద్దరు డాక్టర్లపై వైస్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులతో కలిసి బైఠాయించారు.
దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







