19 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం 11 వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి 11 మంది కంటెస్టెంట్ లో వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎనిమిది మంది బిగ్ బాస్ హౌస్ లో ఉండగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కేవలం కెప్టెన్ గా ఉన్నటువంటి మానస్ మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు.
అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా కొట్లాటల మధ్య కొనసాగింది.ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ దిష్టి బొమ్మలనుంచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారు వారి దిష్టిబొమ్మ పై కుండ పెట్టి పగలగొట్టాలని సూచించారు.
అయితే ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు.
ఈ క్రమంలోనే మొదటి అవకాశంగా రవికి ఇవ్వడంతో రవి కాజల్, సన్నీను నామినేట్ చేశాడు.
అదేవిధంగా ప్రియాంక షణ్ముక్, సిరిని నామినేట్ చేసింది. సన్నీ శ్రీ రామచంద్ర, రవిని నామినేట్ చేశారు.
సిరి రవి, ప్రియాంకను నామినేట్ చేసింది.కాజల్ రవి, శ్రీరామ్ ను నామినేట్ చేశారు.
షణ్ముఖ్ రవి, శ్రీ రామచంద్రను డామినేట్ చేశాడు.ఇక శ్రీ రామచంద్ర నామినేషన్ ఈ విషయంలో వరెస్ట్ యాటిట్యూడ్ చూపించారు.

ఇక ఈ సందర్భంగా శ్రీరామ్ సన్నీని నామినేట్ చేస్తూ జరిగిన డిస్కషన్ లో భాగంగా గ్రూప్ మేటర్ రావడంతో నేను సిరి, షణ్ముఖ్, మానస్ ఒక పార్టీ ఇప్పుడు ఏం చేస్తావ్ ఆ తర్వాత నేను 5 కోట్ల మందికి ఒక గ్రూప్ లీడర్ ని ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అంటూ నామినేషన్ విషయంలో శ్రీరామచంద్ర వరెస్ట్ యాటిట్యూడ్ చూపించారు.ఇలా శ్రీ రామచంద్ర ఆవేశంగా నామినేట్ చేసేసారు.ఈ విధంగా ఈ వారం ఏడు మంది కంటెస్టెంట్ నామినేషన్ లో ఉన్నారు.

శ్రీ రామచంద్ర ఈ వారం నామినేషన్ లో భాగంగా తన బిహేవియర్ లో తేడా రావడంతో ఇతను పూర్తిగా డేంజర్లో పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు శ్రీ రామచంద్ర వ్యవహారశైలిని జీర్ణించుకోలేక అతనిపై విమర్శలు చేస్తున్నారు.దీంతో శ్రీ రామచంద్రకు మైనస్ అవుతూ ఓట్లు తక్కువగా పడటం, సన్నీకి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.

మొదటినుంచి శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటారని చాలామంది భావించారు.అయితే ప్రస్తుతం శ్రీరామచంద్ర బిహేవియర్ చూస్తుంటే అతను ఈ వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా ఉందని భావిస్తున్నారు.ఏదిఏమైనా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండాల్సిన శ్రీరామచంద్ర ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోతున్నారని తెలుస్తోంది.