గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అంబులెన్స్ ను అందించారు.తార్నాక లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చామన్నారు.
ఈ అంబులెన్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఈ వాహనాల్లో ఆక్సీజన్, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.