తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో ఓ గోమాతకు స్థానికులు వేడుకగా ఘనంగా శ్రీమంతం నిర్వహించారు గ్రామానికి చెందిన జొన్న సాంబశివరావు (బుడ్డి)(రైల్వే ఉద్యోగి) అనే యువకుడు ఈ కార్యక్రమంను నిర్వహించాడు స్థానిక మహిళలు సంప్రదాయబద్ధంగా ఆవును పసుపు, కుంకుమ లతో పూజించి,నూతన వస్త్రాలు , పూలతో అలంకరించి వేడుక జరిపారు అనంతరం శ్రీమంతం కు వచ్చిన మహిళలు అందరికి పసుపు-కుంకుమ సారె అందించారు పెద్ద సంఖ్యలో గ్రామంలో ని మహిళలు ఈ వేడుక లో పాల్గొన్నారు
తాజా వార్తలు