శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ రామకృష్ణ పై దాడి జరిగింది.లొద్దపుట్టి గ్రామంలో వివాదంపై భారీగా గ్రామస్తులు సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని ఎస్ఐ రామకృష్ణ వారిని మందలించారు.పోలీసులు ప్రతిసారి తమను మందలిస్తున్నారు అంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
అనంతరం ఎస్ఐ రామకృష్ణతో సహా సిబ్బంది పై లొద్దపుట్టి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.