ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్, స్పేస్ నిపుణులు, సామాన్య ప్రజానీకంలో ఉత్కంఠ రేకెత్తించిన స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్ 4 ప్రయోగం విజవంతంగా పూర్తైంది.స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం రాత్రి 8 గం.2ని.అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఇన్‌స్పిరేషన్ 4 బృందం.మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది.తిరిగి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్ అయ్యింది క్రూ.బిలియనీర్, షిఫ్ట్ పేమెంట్స్ వ్యవస్థాపకుడు జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని క్రిస్ సెంబ్రోస్కి(యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్), సియాన్ ప్రోక్టర్(జియోసైంటిస్ట్), హాయిలే ఆర్కేనాక్స్(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది.బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.
వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచనున్నారు.
దీని ద్వారా అంతరిక్షయానంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కొత్త చరిత్ర సృష్టించినట్లయ్యింది.
రోదసి యాత్రలో వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్‌ల కంటే తాను ఒక మెట్టుపైనే వున్నట్లు నిరూపించింది.వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి.
సురక్షితంగా భూమికి చేర్చించింది.గంటలు, నిమిషాల సేపు కాకుండా మూడు రోజుల పాటు వారిని రోదసీలో వుంచింది.

గత కొన్ని నెలలుగా అంతరిక్ష యాత్రలపై విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.
తొలుత బెజోస్ అంతరిక్ష యాత్ర గురించి ప్రకటించగా.ఆయన కంటే ముందే రోదసిలోకి వెళ్లిన ఘనతను దక్కించుకున్నారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్.అయితే వర్జిన్ కంటే ఎత్తుకు వెళ్లి ప్రత్యేకత చాటుకున్నారు బెజోస్.వర్జిన్ గెలాక్టిక్ కంటే మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్’ యాత్ర సాగింది.
బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.నేల నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి తెలిసిందే.బెజోస్ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు.అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు.
అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది.దీంతో బెజోస్ 106 కిలోమీటర్లు అంతరిక్ష యాత్ర చేశారు.

వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ ప్రయోగాలు పూర్తిగా వ్యాపార దృక్పథంతో చేసినవి. స్పేస్‌ఎక్స్ లాంచింగ్ వెనుకా వ్యాపార ప్రయోజనాలు ఉన్నప్పటికీ.ఇందులో సామాజిక కోణాన్ని స్పృశించారు ఎలన్ మస్క్.స్పేస్‌ఎక్స్ ఇన్‌స్పిరేషన్4కి ఎంత ఖర్చు అయ్యిందనే దానిపై వివరాలు లేవు.కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం. సెయింట్ జూడ్ ఆస్పత్రి క్యాన్సర్ పరిశోధనల కోసం 200 మిలియన్ డాలర్ల సేకరణ .ఫండ్ రైజింగ్ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్‌మస్క్, స్పేస్‌లోకి వెళ్లిన నలుగురు స్పేస్ టూరిస్టుల ఉద్దేశం.ప్రస్తుతానికి అది 154 మిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం.