గతంలో ఒక సినిమా వస్తుంది అంటే ఎవరి గొంతులు ఎలా ఉంటే వారితోనే డబ్బింగ్( Dubbing ) చెప్పించి ప్రేక్షకుల ముందుకు సినిమాని వదిలేవారు.పాటలు కూడా హీరో, హీరోయిన్స్ మాత్రమే పాడుకునేవారు.
కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా డిపార్ట్మెంట్స్ సినిమాలో వచ్చి చేరాయి.గొంతు బాలేకపోయినా అరువు తెచ్చి మరి ఇంకొకరితో డబ్బింగ్ చెబుతారు, పాటలు సింగర్స్ తోనే( Singers ) పాడిస్తారు.
ఇలా ఒక పని కోసం ఒకప్పుడు ఒకే వ్యక్తి పని చేస్తే ఇప్పుడు ముగ్గురు నలుగురు వ్యక్తులు పనిచేయాల్సి వస్తుంది.దీన్ని మనం తప్పు పట్టలేము… ఎందుకంటే ప్రేక్షకుడి అభిరుచి టైం టు టైం మారిపోతూనే ఉంటుంది.
అందువల్ల కొత్తదనం చూపిస్తేనే మళ్లీ థియేటర్ కు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.ఇది ఇప్పుడు మొదలైన ట్రెండ్ ఏమీ కాదు.
ఒక 30, 40 ఏళ్ల క్రితం నుంచి ప్రతి విషయానికి ఇంకొకరిపై ఆధారపడటం బాగా అలవాటు చేసుకున్నారు ఈ దర్శక నిర్మాతలు.

ఇక అసలు విషయంలోకి వెళితే కొన్నిసార్లు కొన్ని గొంతులు వింటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది.అలా మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణన్ని క్రియేట్ చేసే గొంతు ఎవరిదైనా ఉంది అంటే అది ఎస్పీ శైలజ( SP Sailaja ) గొంతు మాత్రమే.నిజానికి చాలామందికి ఆమె సింగర్ గా మాత్రమే పరిచయం.
ఆ తర్వాత ఇటీవల కొన్ని షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది.అవి కూడా సంగీత పరంగా ఉన్న షోలకు మాత్రమే ఆమె వస్తూ ఉంటుంది.
కానీ ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా( Dubbing Artist ) ఎంత చక్కని గొంతు కలిగి ఉంటుందంటే ఆమె కొంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది వాటిని ఇప్పటికీ మనం అలా చూస్తూనే ఉంటాం.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వసంత కోకిల సినిమాలో శ్రీదేవి( Sridevi ) పాత్ర.ఈ పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పిన విధానం అత్యద్భుతం శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది.ఆమె మాటలు గలగల వస్తుంటే చాలా చక్కగా ముచ్చటేస్తుంటుంది.
అంత ఎందుకు కొంచెం వెనక్కి వెళితే మురారి సినిమాలో సోనాలి బింద్రే( Sonali Bendre ) పాత్రకు శైలజ డబ్బింగ్ చెప్పారు.ఆ సినిమాలో ఎస్పీ శైలజ గొంతు ఎంత బాగుంటుంది అంటే ఇప్పటికీ మురారి సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా సోనాలి బింద్రే ను అలా చూస్తూనే ఉంటాం.
ఇక నిన్నే పెళ్లాడుతా సినిమాలో గ్రీకువీరుడు అంటూ టబు( Tabu ) చెప్పిన మాటలు కూడా ముచ్చటగా ఉంటాయి.ఆ సినిమాలో కూడా టబుకి శైలజ గొంతు అరువిచ్చింది.
ఇలా కొన్ని ముఖ్యమైన పాత్రలో ఇప్పటికీ గుర్తు సజీవంగా నిలబెట్టిన చిత్రాలు శైలజ ఖాతాలో ఉన్నాయి.మీరు కూడా ఓసారి అది శైలజ గొంతు అనుకొని చిత్రాన్ని చూడండి మీరు కచ్చితంగా శైలజ తో ప్రేమలో పడతారు.