మహిళల T20 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ కి చేరుకున్న సౌత్ ఆఫ్రికా..!!

మహిళల టి20 వరల్డ్ కప్ టోర్నీలో మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య నిన్న జరిగింది.ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.

 South Africa Reached The Final Of The Womens T20 World Cup Tournament-TeluguStop.com

అయితే శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య జరిగింది.రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.

ఈ విజయంతో మొదటిసారి మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీలో సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి చేరుకొని చరిత్ర సృష్టించింది.పైగా మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ సౌత్ ఆఫ్రికా లోనే జరగటం విశేషం.

Telugu Australia, England, Icc Cup, India, Sa Eng, Semi Final, Africa, Africa Cr

దీంతో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించటంతో… ఆ దేశ క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేసుకుంటున్నారు.మొదటి నుండి చాలా దూకుడుగా ఆడుతూ మెరుగైన రన్ రేట్ తో సెమీ ఫైనల్ కి చేరుకుంది.సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ కీ చేరుకోవడం జరిగింది.సునే లాస్ నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా జట్టు… మంచి ఫామ్ లో ఉంది.

కాగా ఆదివారం బలమైన ఆస్ట్రేలియా జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.ఫైనల్ లో ఆసీస్ పై గెలిస్తే మహిళల సఫారీ టీం తొలిసారి ప్రపంచ కప్ సాధించినట్లు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube