ఇటీవలే తెలుగులో ప్రముఖ దర్శకురాలు “సుధా కొంగర” దర్శకత్వం వహించిన “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “మలయాళ బ్యూటీ అపర్ణ బాలమురళి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో సూర్య భార్య బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలమురళి కి సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ చిత్రంలోని బేబీ పాత్రకి బాగా కనెక్ట్ అయిన కొందరు నెటిజన్లు బేబీ లాంటి భార్య తమ జీవితంలోకి వస్తే బాగుంటుందని కామెంట్లు కూడా చేస్తున్నారు.
అయితే తాజాగా నటి అపర్ణ బాల మురళి కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతకీ ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు అపర్ణ బాలమురళి తన తల్లిదండ్రులు కెపి బాలమురళి, శోభ బాలమురళి లతో కలిసి తీయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం అపర్ణ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేగాక చిన్నప్పుడు అపర్ణ బాల మురళి “చాలా క్యూట్ గా ఉందంటూ” కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అపర్ణ బాల మురళి సినిమా పరిశ్రమలో హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా పలు చిత్రాలలో పాటలు పడింది. దీంతో ప్రస్తుతం తమిళ భాషలో ప్రముఖ దర్శకుడు “రాసు రంజిత్” దర్శకత్వం వహిస్తున్న “తీందుమ్ తెందుమ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు సి.సత్య సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు.