ప్రత్యేక హోదాపై 'అమ్మ' అరుపు

చెప్పినట్లుగానే.మాట ఇచ్చినట్లుగానే సోనియ గాంధీ సాహసం చేసి రాష్టాన్ని విడగొట్టేసింది.అయితే ఇదిలా ఉంటే.ఆ నిర్ణయం తమకు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో అని మాత్రం ఆమె ఆలోచించుకోలేదు…దాని ఫలితంగానే కనీసం అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించే అవకాశం కూడా లేకుండా జనం ఓటు దెబ్బతో వాతలు పెట్టేశారు.

 Sonia Commetns On Ap Special Status-TeluguStop.com

ఎన్నికల ముందు హడావిడిగా రాష్ట్రవిభజనపై తుది నిర్ణయం తీసుకున్న సోనియా.హడావిడిగా ఆ ప్రక్రియ కానిచ్చేశారు.అడ్డుచెప్పిన ఆంధ్రానేతలపై హామీల వర్షం కురిపించారు.ప్రత్యేక హోదా ఇస్తాం.

పోలవరం ఇస్తాం.స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం.

రాజధానికి డబ్బులిస్తాం.ఇలా ఎన్నో చెప్పారు.

హామీలు ఇచ్చిన సోనియా పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోతే.అధికారంలోకి వచ్చిన కమలదళం ఆనాటి హామీల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

చూద్దాం.చేద్దామంటూ సాగదీత వైఖరి అవలంభిస్తోంది.

ఆంధ్రాలో పూర్తిగా మట్టికరిచిన పార్టీని మళ్లీ బతికించుకోవడానికి కాంగ్రెస్ కు ఇప్పుడు ఈ అంశమే దిక్కయింది.ఇక దీనిపై ఎన్నాల్లుగానొ మూగబోయిన సోనియా మళ్లీ నోరు తెరిచారు.

ఏపీకి ప్రత్యేక హోదా.ఐదేళ్లు చాలదు.

పదేళ్లు కావాలని పార్లమెంట్ లో అడిగారు కదా.మరి ఇప్పుడెందుకు వెనక్కుపోతున్నారని.ఆమె కమలదళాన్ని నిలదీసింది.ఈ విషయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోరాటాన్ని ఆమె అభినందించింది.అవసరమైతే పార్లమెంటులో పోరాడదామని భరోసా ఇచ్చిందట.అంతేలే.

పెద్దలు ఊరికినే అన్నారా పోయిన చోటే వెతుక్కోవాలి అని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube