'క్రెడిట్' కోసం కొంగ్రెస్ తహ..తహ!!

120ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి మనుగడ కోసం ఎన్నో సవాళ్లను స్వీకరించి.ఎన్నో ఆటుపోట్లను అనుభవించి రాజకీయ పయనం సాగిస్తుంది.

 Congress Party Masterplan On Telangana-TeluguStop.com

అయితే అన్నేళ్ల చరిత్ర గల కొంగ్రెస్ కు ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేదనే చెప్పాలి.ఇదిలా ఉంటే.

తాజాగా అందిన సమాచారం ప్రకారం…తెలంగాణా సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుని తన ఖాతాలో వేసుకోవాలని కొంగ్రెస్ ఆలోచనలు చేస్తుంది.ఏ ఒక్క అవకాశం దక్కినా వదిలేలా కనిపించడంలేదు కొంగ్రెస్ నాయకులు.

అసలు విషయం ఏంటంటే.తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదించి ఇవాళ్టికి ఏడాది అవుతుంది.గతేడాది ఫిభ్రవరి 13న లోక్ సభలో తెలంగాణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టారు.18న ఉత్కంఠ మధ్య బిల్లు ఆమోదం పొందింది.20న రాజ్య సభలో బిల్లుపై చర్చ జరిగింది… అదే రోజు బిల్లును సభ ఆమోదించింది.ఇదంతా కాంగ్రెస్ హయాంలో జరగడంతో… సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు నేతలు.

తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలతోనే ఏర్పడింది తప్ప ఇతర వ్యక్తులతో కాదని ఎప్పటి నుంచో చెబుతున్న కాంగ్రెస్ నేతలు.టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీస్కెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విభజన బిల్లు పాసయ్యి రేపటికి ఏడాదవుతుండటంతో…అమరవీరుల స్థూపం సాక్షిగా పండుగలా జరుపుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గన్ పార్క్ దగ్గర అమరు వీరుల స్థూపానికి నివాళర్పించటంతో పాటు అమర వీరుల కుటుంబాలను సన్మానించాలని నిర్ణయించారు.

తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా స్థూపం దగ్గర మౌన దీక్ష చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.ఇదే క్రమంలో కేసీఆర్ పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ తమను తాము బ్రతికించుకోవడానికి పధకాలు రచిస్తున్నారు.

మరి ఈ హడావిడీని జనం ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube