ఆంధ్రా 'భద్రాచలం' ఇదే

విభజన పుణ్యమా ఆంటీ అనేక పరిణామాలు చోస్తూ చేసుకున్న విషయం అందరికి విదితమే.ఇక అందులో భాగంగానే ఇచ్చుకోవాల్సినవి.

 Ap Govt Confirms Ontimitta Sriram Temple As Special Temple-TeluguStop.com

పుచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.అవి ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే.రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని భద్రాచలం ఆలయాన్ని తెలంగాణకు కేటాయించడం .ఆ రాష్ట్రానికి కాస్త ఉరట కలిగించే అంశం.అందులోనూ భద్రాచలం మండలాన్నంతా ఏపీకి ఇచ్చేసి కేవలం భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణకు ఇచ్చారు.

ఈ నిర్ణయంతో ఇప్పుడు ఆంధ్రాలో నవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న చిక్కుముడి వచ్చింది.శ్రీరామనవమి వేళ… కల్యాణానికి ఏపీ ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

విభజన తర్వాత వస్తోన్న తొలి శ్రీరామనవమికి భద్రాచల రాముడికి తెలంగాణ ప్రభుత్వం ఈ లాంఛనాలు సమర్పిస్తుంది.మరి ఏపీ ఏంచేయాలి.ఏ ఆలయానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించాలి.? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఏపీలోని రెండు మూడు రామాలయాలను సర్కారు పరిశీలించింది.అందులో కడపలోని ఒంటిమిట్ట రామాలయం ఒకటి.దీనికి పోటీగా విజయనగరం జిల్లాలోని శ్రీరామతీర్థ ఆలయం కూడా చివరివరకూ పోటీలో నిలిచింది.చివరకు ఒంటిమిట్టలోనే అధికారికంగా నవమి వేడుకలు జరపాలని ఏపీ సర్కారు డిసైడ్ చేసింది.ఈ మేరకు చంద్రబాబు ఫైల్ పై సంతకం చేశారు కూడా.

ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచీ నవమి వేడుకలు జరగడం విశేషం.ఇదే క్రమంలో కడపపై చంద్రబాబు పాగా వెయ్యాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం ప్రకటించినట్లు రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube