'అనాగరికమైన' రీతిలో 'ఉపఎన్నిక'

తిరుపతి సిట్టింగ్ ఎం.ఎల్.

 Congres Fires On Tirupati By-poll-TeluguStop.com

ఏ వెంకటరమణ హటాత్తుగా మరణించడంతో తిరుపతిలో ఎన్నికలు జరిగాయి.అయితే ఈ ఎన్నికల విషయమై కొంగ్రెస్ విమర్శలు ఆకాశాన్ని తాకాయి.

ఈ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో కొంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఎదురు దాడికి దిగింది.అసలైతే ఏకగ్రీవంగా జరుగుతుందనుకొన్న ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలింది.

గతంలో తమ ఎమ్మెల్యే మరణించినప్పుడు చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించలేదని.అందుకే తాము అభ్యర్థిని బరిలో దింపుతున్నట్టుగా ప్రకటించింది బరిలో నిలిచింది.

అయితే కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపులేకపోయింది.కేవలం పదివేల లోపు ఓట్లతో సరిపెట్టుకొంది ఆ పార్టీ.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల గురించి స్పందించారు.ఈ ఎన్నికల్లో పూర్తిగా రిగ్గింగ్ జరిగిపోయిందని వారు స్పష్టం చేశారు.

ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరోఅడుగు ముందుకేశాడు.దీనిపై రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.

దారుణమైన స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్లు రిగ్గింగ్ చేసుకొన్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు.అంత అనాగరమైన రీతిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగిందని ఆయన చెప్పాడు.

ఇక రిగ్గింగ్ విమర్శలు ముందు నుంచి వచ్చినవే కానీ.ఇలాంటి ప్రక్రియ ఆఫ్రికాలో కూడా జరగదని రఘువీరారెడ్డి తమ నిరసన స్వరాన్ని వినిపించడం గమనార్హం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube