పాటలు కూడా పాన్ ఇండియా గా.... లిరిక్స్ కోసం భారీ హంగులు

సినిమా అంటే మొత్తం వ్యాపారమే.సినిమా పాటలు కూడా ఇందులో భాగమే.

 Songs Became Pan India Music Director Thaman Details, Pan India Songs, Music Dir-TeluguStop.com

ఒకప్పుడు ఆడియోకి సపరేట్ బిజినెస్ మాడ్యూల్ ఉండేది.సినిమాల ఆడియోలని క్యాసెట్స్ రూపంలో విడుదల చేసేవారు.

పాటలు ఎంత బాగుంటే.అన్ని క్యాసెట్స్ అమ్ముడుపోయేవి.

నిర్మాతలకు, ఆ రైట్స్ కొనుకున్న ఆడియో కంపెనీలకి అంత లాభం ఉండేది.కానీ.

, కాలక్రమంలో ట్రెండ్ మారింది.టేప్ రికార్డర్స్ కనుమరుగయ్యాయి.

యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం మొదలయింది.నిన్న మొన్నటి వరకు.

యూట్యూబ్ లో కూడా పాటలకు అంత బిజినెస్ జరుగుతూ ఉండేది కాదు.కానీ.

, ఈ మధ్య కాలంలో ఆ లెక్క మారింది.

ఇటీవల కాలంలో పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

లిరికల్ వీడియోలుగా ముందే రిలీజ్ అయి కొన్ని వందల మిలియన్ల వ్యూస్ సంపాదించి అటు సినిమాకి పేరు, ఇటు ఆడియో కంపెనీలకి డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.ఇక ఆయా సినిమాకి పని చేసే మ్యూజిక్ డైరెక్టర్ ని బట్టి కూడా.

ఆ పాటలకి రీచ్ పెరిగిపోతోంది.ఈ విషయంలో అందరికన్నా ముందున్నారు సంగీత సంచలనం ఎస్.ఎస్.థమన్.ఈ మధ్య కాలంలో థమన్ మ్యూజిక్ చేసిన మెజారిటీ సాంగ్స్ వందల మిలియన్ వ్యూస్ దక్కించుకుంటూ.బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి.ప్రస్తుతం తమన్ సూపర్ స్టార్ మహేష్ సినిమా ‘సర్కారు వారి పాటకి’ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి, పెన్నీ పెన్నీ సాంగ్స్ భారీగా హిట్ అయ్యాయి.

ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాటలు చేస్తున్న బిజినెస్ పై స్పందించారు.

Telugu Kalaavathi, Lyrical, Mehesh Babu, Views, Music Thaman, Pan India, Penny P

పాటలు కూడా ఇప్పుడు పాన్‌ ఇండియా అయిపోయాయి.ఓ పాట హిట్ అవ్వాలంటే అది ఏ సింగర్‌తో పాడించాలి? ఆ సాంగ్ లైన్ గ్లోబల్‌గా ఉందా? లేదా? లిరికల్‌ వీడియో ఎలా చేయాలి? ఇలాంటివన్నీ చాలా ముఖ్యంగా మారాయి.వాటిని చాలా బాధ్యతగా చూసుకోవాలి.ఒక్కో పాట కొన్ని వందల మిలియన్ వ్యూస్ సాధించడమంటే మామూలు విషయం కాదు.పాటలు బాగుండి రీచ్ వస్తున్నాయి కాబట్టి లిరికల్ వీడియోలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు.ఆడియో కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి.

వాళ్ళ లెక్కలు వాళ్లకి ఉంటాయి” అని థమన్ తెలియజేశాడు.మరి.థమన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube