నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం.సోమశిల నుంచి పెన్నా నదికి భారీగా వస్తున్న వరద నీరు.నిన్న ఉదయం నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల.ఇవాళ వేకువజాము నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం.ఎగువ ప్రాంతాల నుంచి సోమశిలకి చేరుతున్న 4లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం.మునిగిపోయిన పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాలు.ఉధృతంగా మారిన పెన్నా నది.నగరంలోని వెంకటేశ్వర పురం, భగత్ సింగ్ కాలనీ, పొర్లుకట్ట తదితర ప్రాంతాలు మునక.
స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు.మునక కాలనీలు సందర్శించి పునరావాస బాధితులతో మాట్లాడిన మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జాతీయ రహదరిపైకి చేరుతున్న పెన్నా నీటి ప్రవాహం.నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది ఉదృతి, వెంకటగిరి – నాయుడుపేట మధ్య రాకపోకలు బంద్.
వాకాడు వద్ద దశాబ్ద కాలం తర్వాత గేట్లు ఎత్తి నీటి విడుదల.గూడూరు వద్ద పంబలేరు ఉదృతి, జాతీయ రహదారిపై భారీగా నీరు.
పంటపొలాల్లోకి భారీగా వచ్చి చేరిన వరద నీరు.జిల్లాలో భారీగా పంట నష్టం, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు.
సోమశిలలో మునిగిపోయిన సోమేశ్వరాలయం. గోపురం ఎత్తులో ప్రవహిస్తున్న సోమశిల జలాశయం.జలాశయం కట్టినప్పటి నుంచి ఈ స్థాయిలో నీటి ప్రవాహం ఇదే మొదటి సారి.కొట్టుకుపోయిన ఆలయ ప్రహరీ గోడలు, పలు విగ్రహాలు.శివాలయం మునిగిపోవడంతో ఆందోళనలో భక్తులు.