ప్రపంచంలోని ఐదు వింత లైబ్రరీలు

పుస్తకాలు మనిషికి మంచి స్నేహితుడిగా పరిగణిస్తారు.పుస్తకాల ల‌భ్య‌త‌ను సులభతరం చేయడానికి లైబ్రరీలు దోహ‌ద‌ప‌డ‌తాయి.ఈ నేప‌ధ్యంలో కొన్ని వింత లైబ్రెరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 వెండింగ్ మెషిన్ లైబ్రరీ

వెండింగ్ మెషిన్ అంటే డబ్బు అందించ‌డం ద్వారా వస్తువులు బయటకు వచ్చే యంత్రం.పాల యంత్రం, ఏటీఎం, శీతల పానీయం వెండింగ్ మెషిన్ మొదలైనవి.కాలిఫోర్నియాలోని ఈ లైబ్రరీని వెండింగ్ మెషీన్ మాదిరిగా రూపొందించారు.ఈ లైబ్రరీ 24 గంటలూ తెరిచే ఉంటుంది.

2 ఒంటెపై లైబ్రరీ

కెన్యాలో “ఒంటె లైబ్రరీ” బాగా ప్రాచుర్యం పొందింది.నిజానికి ఈ దేశంలో పుస్తకాలు చేరవేసే పని ఒంటెల ద్వారానే జరుగుతుంది.ఈ విధంగా 1980లలో ఒంటెలపై పుస్తకాలు అందించే పని మొదలైంది.పుస్తకాలను పెట్టెల్లో నింపి ఒంటెల ద్వారా రవాణా చేస్తారు.

3 లైబ్రరీ షిప్

ఈ లైబ్రరీ నార్వేజియన్ రాష్ట్రం హోర్డోలాండ్‌లోని ఓడపై నిర్మిత‌మ‌య్యింది.దీనిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఓడలో సుమారు 6000 పుస్తకాలు ఉంచుతారు.ఈ పుస్తకాలు దాని చుట్టుపక్కల ద్వీపాలలో నివసిస్తున్న సుమారు 250 సంఘాలకు పంపిణీ చేస్తారు.ఈ నౌకలో కెప్టెన్, 2 లైబ్రేరియన్, మరో ఇద్ద‌రు సిబ్బంది ఉంటారు.

4 మెయిల్‌బాక్స్ లైబ్రరీ

Telugu Camel Library, Library Mass, Library Ship, Mailbox Library, Machine Libra

ఈ రకమైన లైబ్రరీ సాధారణంగా ఇంగ్లాండ్, ఐరోపాలో కనిపిస్తుంది.పార్కులు, వీధులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ఈ లైబ్రరీలో పాఠ‌కులు తాము చదివిన పుస్తకాన్ని ఉంచుతారు.కొత్త పుస్తకాన్ని తీసుకుంటారు.

5 లైబ్రరీ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్

అర్జెంటీనాలోని ఈ లైబ్రరీ దేశ చీకటి చరిత్రను ప్రతిబింబిస్తుంది.ఈ లైబ్రరీ ట్యాంక్ ఆకారంలో తయారు చేశాఉ.

 Some Interesting Libraries Of The World , Vending Machine Library, Camel Library-TeluguStop.com

ఇందులో 900 పుస్తకాలు ఉన్నాయి.ఈ లైబ్రరీ అర్జెంటీనా స్వాతంత్య్ర‌ పోరాటానికి సంబంధించిన చారిత్రక సేకరణను చూపిస్తుంది.

ఈ లైబ్రరీ ముఖ్య ఉద్దేశ్యం అర్జెంటీనాలోని లైబ్రరీలు లేని చిన్న పట్టణాలకు చేరుకోవడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube