Sohel : ఆ సమయంలో పచ్చడి మెతుకులు తిని బ్రతికా.. అలాంటి కష్టాలు.. సోహెల్ చెప్పిన విషయాలివే!

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా పాపులర్ అయిన సోహెల్ బూట్ కట్ బాలరాజు సినిమా( Boot cut Balaraju movie ) గురించి స్పందిస్తూ ఎమోషనల్ కాగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.సోహెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట మ్యూజిక్ మ్యాజిక్ అని ఒక మూవీ చేశానని నారాయణ అనే ఒక మేనేజర్ లీడ్ క్యారెక్టర్ గా అవకాశం ఇప్పించారని తెలిపారు.

 Sohel Comments About Career Troubles Details Here Goes Viral In Social Media-TeluguStop.com

యురేకా గుడ్ మూవీ అని ఆయన పేర్కొన్నారు.

ఆ సినిమా బిగ్ బాస్ కు ముందు చేశానని సోహెల్( Sohel ) వెల్లడించారు.

బూట్ కట్ బాలరాజుకు పని చేసిన రాకేశ్ ( Rakesh )అనే రైటర్ నా రూమ్ మేట్ అని ఒకానొక సమయంలో నాలుగు రోజులు పచ్చడి మెతుకులు తిని జీవనం సాగించామని సోహెల్ చెప్పుకొచ్చారు.క్యాటరింగ్ కు కూడా వెళ్లానని ఆయన తెలిపారు.

యురేకా తర్వాత ది బెల్స్, కోనాపురంలో, సినీమహల్ సినిమాలలో నటించానని సోహెల్ వెల్లడించారు.

పెద్ద సినిమా చేస్తున్న సమయంలో పెద్ద సినిమా అనే భావన వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.లీడ్ యాక్టర్ గా చేస్తే మనదే సినిమా అనే అభిప్రాయం కలుగుతుందని సోహెల్ పేర్కొన్నారు.కథలను సరిగ్గా జడ్జ్ చేయలేదేమో అని అనిపిస్తుందని ఆయన తెలిపారు.

ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదంటే మనమేం చేయలేమని లాక్ ఆఫ్ పబ్లిసిటీ వల్ల కూడా కొన్ని సినిమాలు ఫ్లాపయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కటీ ఒక అనుభవం అని సోహెల్ చెప్పుకొచ్చారు.కొంచెం గ్యాప్ ఇచ్చి వద్దామా? లేక వరుసగా సినిమాలు చేద్దామా? అనేది అర్థం కావడం లేదని సోహెల్ అన్నారు.నా మాటల వల్ల నష్టం కలిగిన సందర్భాలు ఉన్నాయని సోహెల్ వెల్లడించారు.

నేను సెన్సిటివ్, ఓవర్ థింకింగ్ అని ఆయన కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube