Social Media Celebrities : గంగవ్వ, బర్రెలక్క, ప్రశాంత్, కుమారి , కుర్చీతాత.. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు అయిన ప్రముఖులు వీళ్లే!

ఈ మధ్య కాలంలో పాపులారిటీ రావాలంటే ఇతరులకు భిన్నంగా ఏదైనా చేస్తే చాలని సోషల్ మీడియా ద్వారా ప్రూవ్ అవుతోంది.బిగ్ బాస్ షో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయినా బిగ్ బాస్ షో సీజన్4 ఆమెకు మరింత మంచి పేరును తెచ్చిపెట్టింది.

 These Celebrities Are Social Media Celebrities Gangavva Pallavi Prasanth Kumari-TeluguStop.com

బిగ్ బాస్ షో తర్వాత గంగవ్వ పలు సినిమాలకు ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.గంగవ్వకు( Gangavva ) ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ అయితే తగ్గలేదు.

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు.ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తానని బర్రెలక్క చెప్పారు.

బర్రెలక్క ప్రతిభను మెచ్చి ఆమెకు 15 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారని తెలుస్తోంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన మరో కంటెస్టెంట్ ఎవరనే ప్రశ్నకు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.

రైతుబిడ్డగా పేరు సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచి ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న పలు షోలలో పాల్గొని సందడి చేశారు.పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా క్రేజ్ ను పెంచుకున్న వాళ్లలో కుమారి ఆంటీ ఒకరు.

స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఉత్సవం షోలో కుమారి ఆంటీ( Kumari Aunty ) పాల్గొన్నారు.త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.కుమారి ఆంటీని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అయ్యాయి.

కుర్చీ మడతపెట్టి అనే కామెంట్లతో కుర్చీ తాత( Kurchi Thatha ) కూడా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.గుంటూరు కారం రిలీజ్ తర్వాత కుర్చీతాతకు మరింత క్రేజ్ పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube